Actress: ఆ న‌టి ఆరు నెల‌ల గ‌ర్భ‌వ‌తి..ఈ విష‌యం భ‌ర్త‌కు తెలియ‌దంట‌..!

Actress: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, బెంగాల్ సినీ నటి నుస్ర‌త్ జహాన్ ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. పార్లమెంటు సభ్యురాలిగా ఉన్న నుష్ర‌త్ విచిత్ర‌మైన వార్త‌తో వార్త‌ల‌లోకి ఎక్కింది. వివరాల‌లోకి వెళితే నుష్ర‌త్ తన ప్రియుడు నిఖిల్ జైన్‌తో జూన్ 19, 2019 న వివాహం చేసుకున్నారు. ఇస్లామిక్ సంప్ర‌దాయం ప్ర‌కారం వీరి వివాహం జ‌ర‌గ‌గా, ప్ర‌స్తుతం ఆమె ఆరు నెల‌ల గ‌ర్భ‌వ‌తి అని తెలుస్తుంది.అయితే ఈ విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు నాకు సంబంధం లేదని పేర్కోనడం గ‌మ‌న‌ర్హం.

నుస్రత్, నిఖిల్‌ల మధ్య మనస్పర్థలు రావడంతో గత కొన్ని రోజులుగా వేరు వేరుగా నివసిస్తున్నారు. ఈ జంట విడాకుల తీసుకోవాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. మ‌రోవైపు నుస్ర‌త్ జ‌హాన్.. బెంగాలీ నటుడు, బిజెపి నాయకుడు యశ్ దాస్‌గుప్తాతో రిలేషన్‌లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. ఈ ఇద్దరు నూతన సంవత్సర వేడుకల కోసం రాజస్థాన్‌కు వెళ్లినట్లు అప్పట్లో టాక్ కూడా వార్త‌లు వ‌చ్చాయి.

 

తాజాగా త‌మ పెళ్లిపై నుస్ర‌త్ అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు. తుర్కిష్ వివాహ చట్టాల ప్రకారం విదేశాల్లో చేసుకున్న పెళ్లిళ్లకు న్యాయ బద్ధత లేదు. అందునా మతాంతర వివాహం కావడం వల్ల.. భారత్‌లో దానికి చట్టబద్ధతనిచ్చే ప్రత్యేక వివాహ చట్టాలంటూ ఏమీ లేవు. చట్టం ప్రకారం అది అసలు పెళ్లే కాదు. ఇది స‌హ‌జీవ‌నంతో స‌మానం. మేము ఎప్పుడో విడిపోయాం. నా కుటుంబ బాధ్యతనూ చూసుకుంటున్నాను. మొదట్నుంచీ వారి బాధ్యత నేనే చూసుకుంటున్నాను. ప్రస్తుతం ఎలాంటి ‘సంబంధం’ లేని వ్యక్తి క్రెడిట్ కార్డులను వాడాననడంలో అర్థం లేదు.

నా వారసత్వంగా వచ్చిన నగలు, ఆస్తులను అక్రమంగా లాగేసుకున్నారని, తన డబ్బులను అక్రమ మార్గాల్లో వాడుకున్నారని ఆరోపించారు నుస్ర‌త్. ధనవంతుడిని కాబట్టే నేను వాడుకున్నానని చెప్పిన ఆ వ్యక్తే.. నా బ్యాంకు ఖాతాల్లోని డబ్బును తీసుకున్నాడు. మేం విడిపోయిన త‌ర్వాత కూడా ఆ ప‌ని చేశాడు. దీనిపై పోలీస్ కేసు పెడ‌తాను. నా దుస్తులు, బ్యాగులు, యాక్సెసరీలు ఇంకా వారి దగ్గర్నే ఉన్నాయి.

నా తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు పెట్టిన బంగారు ఆభరణాలను వారి దగ్గరే పెట్టుకున్నారు. క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న‌వ‌న్నీ వారి ద‌గ్గ‌రే ఉంచుకున్నారు. నాకు సంబంధం లేని వ్యక్తులతో నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాల్సిన అవసరం ఇక ఏ మాత్రమూ లేదు. నా జీవితంలో భాగం కాని వ్య‌క్తి గురించి మీడియా ప్ర‌శ్నించ‌కూడ‌ద‌ని కోరుతున్నాను అంటూ నుస్ర‌త్ పేర్కొంది.