Actress: బిడ్డ‌కు పాలిచ్చే వీడియో పంప‌మ‌ని అడిగిన నెటిజ‌న్.. దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్ ఇచ్చిన హీరోయిన్

Actress: సోష‌ల్ మీడియా ప్రాముఖ్య‌త పెరిగాక సెల‌బ్రిటీల‌కు, అభిమానుల‌కు దూరం త‌గ్గింది. ఇద్ద‌రు ఎంచ‌క్క‌గా అనేక విష‌యాల‌ను షేర్ చేసుకుంటున్నారు. సెల‌బ్స్ కూడా నెటిజ‌న్స్ అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు ఓపిక‌గా స‌మాధానాలు ఇస్తున్నారు. అయితే కొన్ని సార్లు కొంద‌రు నెటిజ‌న్స్ చేసే చెత్త ట్వీట్స్ వారి పిచ్చెక్కిపోయే కోపాన్ని తెప్పిస్తుంది. రీసెంట్‌గా ఓ నెటిజ‌న్ హీర‌యిన్‌ని బిడ్డ‌కు పాలిచ్చే వీడియో పంప‌మ‌ని అడిగాడు. దీనికి దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చింది ఆ న‌టి.

బాలీవుడ్ హాట్ హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుని.. టీవీ షో ల ద్వారా కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ నేహా ధూపియా. ‘మిస్ ఇండియా: ది మిస్టరీ’ అనే మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నేహా ధూపియా “క్యా కూల్ హై హమ్‌”, “షూట్ అవుట్ లోఖండ్‌వాలా” వంటి హిట్‌ చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ నిన్నే ఇష్ట‌ప‌డ్డాను,విల‌న్, ప‌ర‌మ‌వీర చ‌క్ర వంటి చిత్రాల్లోనూ నటించింది.

పెళ్లి కాక ముందే గర్బవతి అయిన నేహా ఆ సమయంలో చర్చనీయాంశం అయ్యింది. గర్బవతి అని తెలిసిన తర్వాత పెళ్లికి సిద్దం అయ్యింది. నటుడు, మోడల్‌ అడంగ్‌ సింగ్‌ బేడీ అనే వ్య‌క్తిని 2018 మేలో పెళ్లి చేసుకోగా అదే సంవ‌త్స‌రం నవంబ‌ర్‌లో మెహర్‌ అనే బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన సంగతి తెలిసిందే. ఫ‌స్ట్ డెలివ‌రీ త‌ర్వాత బుల్లితెర‌పై సంద‌డి చేసింది నేహ‌. రీసెంట్‌గాఈ ముద్దుగుమ్మ‌.. బేబీ బంప్‌తో ఫోటోలను షేర్‌ చేస్తూ…’మంచి క్యాప్షన్‌తో రావడానికి రెండు రోజులు పట్టింది. మేం ఆలోచించిన వాటిలో ఉత్తమమైంది ఇదే.. థ్యాంక్యూ గాడ్‌’ అంటూ ఫ్యామిలీ ఫోటోను షేర్‌ చేశారు.

నేహా దూపియా రెండో సారి త‌ల్లి కాబోతున్న విష‌యాన్నిసంతోషంగా సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించ‌గా ఆ సంతోషాన్ని ఓ నెటిజ‌న్ నాశ‌నం చేశాడు. ఈ సారి బిడ్డ‌కు పాలిచ్చే వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌మ‌ని నెటిజ‌న్ కోర‌గా, దానికి స్పందించిన నేహా ధూపియా.. ఈ వ్య‌క్తి వ్యక్తి మాతృత్వంను కూడా కామంతో చూస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తింది. ఆ వీడియోను నేను షేర్ చేయనక్కర్లేదు. మీ అమ్మ లేదా అమ్మమ్మ ను అడిగినా వాళ్లు చూపిస్తారు అంది.

ఇలాంటి వ్యక్తుల వల్ల మూడ్ అంతా చెడి పోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. మంచి సందర్బంలో ఇలాంటి వ్యాఖ్యలు వినాల్సి వచ్చినందుకు ఇబ్బంది గా ఉందని.. అందుకే అతడి గురించి అందరికి తెలియాలనే ఉద్దేశ్యంతో తాను అతడి కామెంట్ కు రిప్లై ఇచ్చాను అంది. చెత్త కామెంట్ చేసిన వ్య‌క్తికి నెటిజ‌న్స్ కూడా గుర్రుగా ఉన్నారు.