Actress Neena Gupta Bold Comments : ముద్దు పెట్టుకుంటే గర్భవతి అవుతారని భయపడేదాన్ని.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
NQ Staff - June 24, 2023 / 12:58 PM IST

Actress Neena Gupta Bold Comments : అప్పుడప్పుడు సెలబ్రిటీలు చేస్తున్న కామెంట్లు నెట్టింట్లో ఎంతగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత పర్సనల్ లైఫ్ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ కావాలనే ఫేమస్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇలాంటి కామెంట్లే చేసింది.
ఆమె ఎవరో కాదు బాలీవుడ్ ప్రముఖ నటి నీనా గుప్తా. ప్రస్తుతం ఆమె లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ సిరీస్ సీజన్-1 కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక లస్ట్ స్టోరీస్-2 లో తమన్నా, విజయ్ వర్మ కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది.
ఇందులో ఎక్కువగా అడల్ట్, కంటెంట్, శృంగారం గురించే ఉంది. అయితే ఈ సిరీస్ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ నీనా గుప్తా సంచలన కామెంట్లు చేసింది. మా అమ్మ నేను కాలేజీ చదువుకుంటున్న రోజుల్లో శృంగారం గురించి అస్సలు చెప్పేది కాదు. అప్పట్లో ముద్దు పెట్టుకుంటే ప్రెగ్నెంట్ అవుతామని నేను భయపడేదాన్ని.
అందుకే అబ్బాయిలకు దూరంగా బతికాను. కానీ పెళ్లి సమయంలో మాత్రం ప్రతి తల్లి తన కూతురుకు శృంగారం గురించి చెబుతుంది. ఎందుకంటే భార్య, భర్తల నడుమ ఎలాంటి గొడవలు రాకుండా ఉండాలనేది వారి అభిప్రాయం. కానీ ప్రతి తల్లి తన కూతురుకు ఇలాంటి విషయాల గురించి కచ్చితంగా చెప్పాలి. అలాంటి వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ అంటూ తెలిపింది నీనా.