టాలీవుడ్ స్టార్స్ కూడా డ్రగ్స్ వాడుతున్నారు: మాధవి లత

Advertisement

టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం మళ్ళీ రేగనుంది. ఇప్పటికే బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేస్ ను విచారిస్తున్న సీబీఐ అధికారులకు బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం ఎదురు పడింది. సుశాంత్ సింగ్ కూడా డ్రగ్స్ వాడేవాడని ఆరోపణలు వస్తున్నాయి. బాలీవుడ్ లో పెద్ద పెద్ద స్టార్స్ డ్రగ్స్ వాడుతున్నారని నటి కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు నటి, బీజేపీ నాయకురాలు చేసిన వ్యాఖ్యలను టాలీవుడ్ లో కలకలం రేపుతున్నాయి.

టాలీవుడ్ లో డ్రగ్స్ వాడుతున్నారని, అధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టి విచారణ చేయాలని ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకుండా అధికారులు సీరియస్ గా విచారణ చేయాలని మాధవి లత వెల్లడించారు. గతంలో టాలీవుడ్ లో డ్రగ్స్ వల్ల ఏర్పడ్డ వివాదాలను ఇంకా మర్చిపోకముందే మాధవి లత ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇండస్ట్రీపై మాధవి లత చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ పెద్దలు, పోలీసు అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here