Mega Star Chiranjeevi : చిరంజీవిని అందరి ముందే తిట్టేసిన ప్రముఖ నటి.. దారుణమైన అవమానం..!
NQ Staff - March 3, 2023 / 02:10 PM IST

Mega Star Chiranjeevi : టాలీవుడ్ లో మెగాస్టార్ ది ఒక చెరగని చరిత్ర. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఒంటరిగా వచ్చి ఆ స్థాయికి ఎదిగిన ఏకైక హీరో చిరంజీవి. ఒక్కడిగా వచ్చి మెగా మేనియాను సృష్టించాడు. ఆయన వేసిన బలమైన పునాదుల మీద ఇప్పుడు ఎంతో మంది స్టార్ హీరోలుగా ఎదుగుతున్నారు. పవన్ కల్యాణ్, బన్నీ, రామ్ చరణ్ లు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారంటే అదంతా చిరంజీవి వల్లే అని చెప్పుకోవచ్చు.
అయితే చిరంజీవి ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఇంకా చెప్పాలంటే ఎన్నో అవమానాలు భరించారు. అప్పట్లో ఓ స్టార్ నటి కూడా చిరంజీవిని తిట్టేదంట. ఈ విషయాలను ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఆమె ఎవరో కాదు స్టార్ యాక్టర్ లక్ష్మీ ప్రియ. ఆమె ప్రాణ స్నేహితులు సినిమాతో అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
షూటింగ్ సమయంలో…
అయితే చిరంజీవి కెరీర్ స్టార్టింగ్ లో అగ్ని సంస్కారం అనే సినిమాలో నటించారు. అందు హీరోయిన్ గా భావన చేసింది. ఇందులో లక్ష్మీ ప్రియ కీలక పాత్రలో నటించింది. కాగా చిరుతో ఆమె నటిస్తున్న సమయంలో.. ఆమెను నువ్వేమైనా వాణి శ్రీ అనుకుంటున్నావా.. ఆ డైలాగ్ చెప్పడం ఏంటి అని సరదాగా చిరు అనేవారంట.
దాంతో ఆమె కూడా చిరును.. నువ్వేమైనా రజినీకాంత్ అనుకుంటున్నావా అంటూ అందరి ముందే కామెంట్లు చేసేదంట. కానీ అదంతా కేవలం సరదాగానే చేసుకునేవారంట. ఇక చిరంజీవి తర్వాత కాలంలో మెగాస్టార్ గా ఎదిగిపోయాడు. ఆయన అంత పెద్ద హీరో అవుతారని ఊహించని లక్ష్మీప్రియ.. తనతో నటించిన వ్యక్తి పెద్ద హీరో అయినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.