Actress Kasthuri Shankar : రాముడికి మీసాలుంటాయా.. ఆదిపురుష్ పై నటి కస్తూరి షాకింగ్ కామెంట్లు..!
NQ Staff - June 10, 2023 / 09:45 AM IST

Actress Kasthuri Shankar : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఆదిపురుష్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో కృతిసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జూన్ 16న మూవీని గ్రాండ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారీగా ప్రమోషన్లు చేస్తున్నారు మూవీ టీమ్.
రీసెంట్ గానే తిరుపతిలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. అయితే మూవీకి మొదటి నుంచి వివాదాలు చుట్టుముడుతున్నాయి. రీసెంట్ గానే ఓం రౌత్, కృతిసనన్ తిరుమల కొండపై ముద్దులు పెట్టుకోవడం సంచలనం రేపింది. ఇదిలా ఉండగా ఇప్పుడు నటి కస్తూరి కూడా షాకింగ్ కామెంట్లు చేసింది.
ఆమె మాట్లాడుతూ.. అసలు శ్రీరాముడికి ఎక్కడైనా మీసాలు ఉంటాయా. కానీ ఆదిపురుష్ లో ప్రభాస్ కు మీసాలు ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు. ఆయన్ను చూస్తుంటే రాముడిలా లేడు.. నాకు కర్ణుడు గుర్తుకు వస్తున్నాడు. టాలీవుడ్ లో ఇప్పటికే చాలామంది రాముడి పాత్రలు చేశారు. అందులో ఎవరికైనా మీసాలు ఉన్నాయా..
మరి ఆదిపురుష్ లో ఈ మార్పులు ఎందుకు చేశారో అర్థం కావట్లేదు. రాముడు, లక్ష్మణుడికి గడ్డలతో చూపించిన సాంప్రదాయం ఎక్కడైనా ఉందా అంటూ ఆమె తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అయితే ఆమె వ్యాఖ్యలపై కొందరు కొందరు సమర్ధిస్తుంటే.. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేయండి.