Actress Hina Khan And Rocky Jaiswal : పబ్లిక్ లోనే ప్రియుడికి లిప్ లాక్ లతో రెచ్చిపోయిన నటి.. దారుణంగా ట్రోల్స్..!

NQ Staff - May 26, 2023 / 11:40 AM IST

Actress Hina Khan And Rocky Jaiswal : పబ్లిక్ లోనే ప్రియుడికి లిప్ లాక్ లతో రెచ్చిపోయిన నటి.. దారుణంగా ట్రోల్స్..!

Actress Hina Khan And Rocky Jaiswal : ఈ నడుమ సినీ సెలబ్రిటీలు దారుణంగా రెచ్చిపోతున్నారు. కనీసం పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా చేయకూడనివి చేసేస్తున్నారు. పైగా ఒకరిని చూసి మరొకరు ఇలా రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎక్కువగా లవ్ ట్రాక్ లు నడుపుతున్నారు. పైగా తమ బాయ్ ఫ్రెండ్స్ కు పబ్లిక్ గానే ముద్దులిచ్చేస్తున్నారు.

తాజాగా హిందీ బుల్లితెర నటి హీనా ఖాన్ కూడా ఇలాగే రెచ్చిపోయింది. ఆమె బుల్లితెరతో చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత హిందీ బిగ్ బాస్ లో కూడా మెరిసింది. ఇదిలా ఉండగా తాజాగా ఆమె శ్రీనగర్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌లో తళుక్కుమని మెరిసింది. అయితే ఈ సమ్మిట్ లో పాల్గొన్న తర్వాత ఆమె నేరుగా ముంబైకు వెళ్లింది.

ముంబై విమానాశ్రయంలో ఆమె కోసం తన ప్రియుడు రాకీ జైస్వాల్ అప్పటికే ఎయిర్ పోర్ట్ బయట ఎదురుచూస్తూ గడిపాడు. ఇక ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాగానే ఈ ఇద్దరు అమర ప్రేమికులు రెచ్చిపోయారు. తన్మయత్వం చెంది ఏకంగా లిప్ లాక్ లు ఇచ్చుకుంటూ హద్దులు దాటిపోయారు.

ఇదంతా అక్కడున్న వారు కెమెరాల్లో రికార్డు చేశారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అవ్వడంతో అందరూ హీనా, ఆమె ప్రియుడు రాకీ జైస్వాల్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇంటికి వెళ్లే వరకు ఆగలేకపోయారా.. పబ్లిక్ లో అవసరమా.. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ మండిపడుతున్నారు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us