Actress Bhoomika Vasishth : డబ్బుల కోసం బట్టలు విప్పి తప్పు చేశాను.. నటి షాకింగ్ కామెంట్లు..!
NQ Staff - June 5, 2023 / 10:05 AM IST

Actress Bhoomika Vasishth : సినిమా రంగం అంటే ఇన్ని రోజులు అందరూ సినిమాలు మాత్రమే అనుకున్నారు. కానీ ఇప్పుడు వెబ్ సిరీస్ లు, బుల్లితెర ప్రోగ్రామ్ లు, రియాల్టీ షోలు బాగా పెరిగిపోతున్నారు. ఇక రియాల్టీ షోలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ షోలలో కొందరు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
తాజాగా ఎమ్ టీవీ రోడీస్ అనే కొత్త సీజన్ ను స్టార్ట్ చేసింది. గతంలో స్ప్లిట్స్ విల్లాలో కంటెస్టెంట్ గా పాల్గొన్న నటి భూమిక వశిష్ట్ కూడా ఇందులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె ఇందులో బోల్డ్ కామెంట్లు చేసింది. నేను డ్యాన్స్ షోల ద్వారా పాపులర్ అయ్యాను. ఆ సమయంలో నా గ్లామర్ ను కాపాడుకునేందుకు నా డబ్బులు సరిపోయేవి కావు.
గ్లామర్ మెయింటేన్ చేయడం కోసం అప్పులు కూడా చేశాను. ఇక అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో ఓ తప్పు కూడా చేశాను. బట్టలు విప్పి ఆ వీడియోను ఓ యాప్ లో అప్ లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ కొందరు ఆ వీడియోను సోషల్ మీడియాలో లీక్ చేశారు. దాంతో తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది.
దాంతో చాలా రోజులు డిప్రెషన్ లోకి వెళ్లాను. ఆ తర్వాత కోలుకుని బయటకు వచ్చాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను అంటూ చెప్పింది ఈ బ్యూటీ. ఇక ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.