Actress Asin Thottumkal Divorce News Viral : షాకింగ్.. భర్తకు విడాకులు ఇవ్వబోతున్న హీరోయిన్ ఆసిన్..!
NQ Staff - June 28, 2023 / 01:27 PM IST

Actress Asin Thottumkal Divorce News Viral
హీరోయిన్ ఆసిన్ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె టాలీవుడ్ లో ఎక్కువ హిట్లు కొట్టిన హీరోయిన్. చాలా తక్కువ సమయంలోనే తెలుగుతో పాటు తమిళంలో కూడా భారీ హిట్లు అందుకుంది ఈ భామ. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ కూడా మంచి హిట్లు వచ్చాయి.
ఇలా కెరీర్ పీక్స్ లో ఉండగానే 2016 లో రాహుల్ శర్మ అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది ఆసిన్. అసిన్ భర్త రాహుల్ మైక్రో మాక్స్ కంపెనీ కి సి.ఈ.ఓగా పనిచేశారు. వీరిద్దరి పెండ్లి విషయంలో హీరో అక్షయ్ కుమార్ అన్ని విధాలుగా సాయం చేశారు.
కాగా వీరిద్దరూ కొంత కాలంగా వేరుగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఆసిన్ భర్త ఆమెను దూరంగా పెట్టేస్తున్నారంట. ఆయన కొంత కాలంగా వేరే అమ్మాయితో ఎఫైర్ నడుపుతున్నారు. ఈ విషయంలో ఆసిన్ హెచ్చరించినా ఆయన పట్టించుకోవట్లేదు. దాంతో పాప ఉన్నా సరే విడాకులు ఇవ్వాలని ప్రయత్నిస్తోంది ఆసిన్.
ఇందుకు సంబంధించిన న్యూస్ ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. త్వరలో ఈ జంట విడాకులు తీసుకోబోతుందంటూ ఇప్పుడు గాసిప్స్ మొదలయ్యాయి. ఆమె విడాకులు ఇస్తానని చెప్పినా సరే ఆమె భర్త తన పద్ధతి మార్చుకోవట్లేదని తెలుస్తోంది.