షూటింగ్ లో ప్రమాదం.. ఐసీయూ లో హీరో..!

Admin - October 7, 2020 / 12:43 PM IST

షూటింగ్ లో ప్రమాదం.. ఐసీయూ లో హీరో..!

సాధారణంగా సినిమా షూటింగ్ లో జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాను నిర్మిస్తారు. అయితే ఒక చిత్ర షూటింగ్ లో ప్రమాదం వాటిల్లింది. వివరాల్లోకి వెళితే మలయాళ యంగ్ హీరో టొవినో థామస్ షూటింగ్ లో ప్రమాదం జరిగింది. ఇక ఈ ప్రమాదంలో అతడు‌ తీవ్ర గాయాలతో కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే థామస్ నటిస్తున్న ‘కాలా’ అనే సినిమా షూటింగ్ ‌లో యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది.

ఇక తీవ్ర గాయాలు కావడంతో వెంటనే టొవినో థామస్ ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఉన్న ఆయనకు కడుపులో ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతోందని, కండిషన్ క్రిటికల్ గా ఉందని 24 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమని డాక్టర్లు తెలిపారు. థామస్ తొందరగా కోలుకోవాలని మలయాళ సినీ పరిశ్రమకు చెందిన వారు కోరుకుంటున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us