సోనూ సూద్ రేంజ్ మారిపోయింది ఇప్పుడు ఏకంగా ఆయన పేరుమీద…

Admin - July 23, 2020 / 10:41 AM IST

సోనూ సూద్ రేంజ్ మారిపోయింది ఇప్పుడు ఏకంగా ఆయన పేరుమీద…

సోనూసూద్. టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో తన నటనతో అందరిని మెప్పించి ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. అయితే ఈ రీల్ హీరో కాస్త లాక్ డౌన్ కాలంలో రియల్ హీరోగా మారాడు. లాక్ డౌన్ లో ఎంతో మంది వరుస కూలీలకు తన శాయశక్తులా సాహయాన్ని అందించాడు. దానితో ఇప్పుడు సోనూసూద్ కి ఎక్కడ లేనంతగా ఆదరణ లభిస్తుంది.

లాక్ డౌన్ సమయంలో వివిధ చోట్ల ఆగిపోయిన వరుస కూలీల పరిస్థిని అర్ధం చేసుకున్న సోనుసూద్ దాదాపుగా వేళా సంఖ్యలో వరుస కూలీలను తన స్వంత డబ్బుతో స్వస్థలాలకు తరలించడం జరిగింది. దానిలో బాగంగానే కేర‌ళ రాష్ట్రం కొచ్చిలో చిక్కుకున్న 169 మంది ఒడిశా వాసులకు విమాన‌చార్జీలు చెల్లించి వారు స్వ‌రాష్ట్రానికి చేరుకునేందుకు సాయ‌ప‌డ్డాడు. దీంతో ఆయ‌న నుంచి సాయం పొందినవారు త‌మ‌కు తోచిన రీతిలో కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నారు.

అలా తన సహాయం పొందిన ఒక గర్భిణీ స్త్రీ ఈ మధ్యకాలంలో తనకు పుట్టిన బిడ్డకు సోనుసూద్ శ్రీవాత్సవ అని పేరు పెట్టుకోవడం జరిగింది, అదే విధంగా ఒడిశ్శాకి చెందిన ప్రశాంత్ కుమార్ ప్రధాన్ అనే వ్యక్తి ఒడిశ్శాకి చేరుకున్న తరువాత తనకు ఏ పని దొరకడంతో తన దగ్గరున్న కొద్ది మొత్తంతో ఒక వెల్డింగ్ షాప్ పెట్టుకొని తాను ఆలా ఒడిశ్శాకి చేరుకొని ఒక షాప్ ని పెట్టుకోవడానికి కారణం అయిన సోనుసూద్ కి కృతజ్ఞత తెలిపే విధంగా తాను పెట్టుకున్న షాప్ కి సోనూసూద్ వెల్డింగ్ వర్క్ షాప్ అని పెట్టుకున్నాడు.

అయితే ఈ విషయం కాస్త సోనూసూద్ కి తెలియడంతో దీనిపైన సోనూసూద్ స్పందిస్తూ నేను ఎన్నో బ్రాండ్లకు పని చేసాను కానీ ఎప్పుడు ఇలాంటి పేరుని సంపాదించలేదు. నిజంగా ఇది నాకు చాలా నచ్చింది. ఇక నుండి ఒడిశ్శా ఎప్పుడు వెళ్లిన తప్పకుండా ప్రశాంత్ షాప్ ని సందర్శిస్తా .. వీలైతే నేను కూడా వెల్డింగ్ నేర్చుకుంటా అంటూ తెలపడం జరిగింది . ఇతని వ్యక్తిత్వాన్ని, సహాయ గుణాన్ని దగ్గరి నుండి చూసిన ఎవ్వరైన కూడా ఇతను రియల్ హీరో అని అననకుండా ఉండలేరు.

కేవలం వలస కార్మికుల్ని వారి స్వస్థలకు చేర్చడం తో చేతులు దులిపేసుకోకుండా సోనూసూద్ ఇంకా పేదలకు సహాయపడాలని అవసరం ఉన్న పేదవారి గురించి తెలుసుకున్నాడంట. నాకు తెలిసి ఏ రీల్ కూడా సోనుసూద్ వ్యక్తిత్వానికి సాటి రాడు అనే చెప్పాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us