Actor Ravi Krishna : నవ్య స్వామితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రవికృష్ణ.. ప్రపోజ్ చేస్తానంటూ..!
NQ Staff - May 9, 2023 / 01:40 PM IST

Actor Ravi Krishna : ఈ నడుమ సీరియల్ హీరో, హీరోయిన్లకు కూడా బాగానే ఫాలోయింగ్ ఏర్పడుతోంది. ఎందుకంటే వారు కేవలం సీరియల్స్ కు మాత్రమే పరిమితం కాకుండా ఇటు బుల్లితెరపై వచ్చే పలు షోలలో కూడా సందడి చేస్తున్నారు. అలా వారికి కూడా సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ పెరుగుతోంది.
ఇక బుల్లితెరపై కొన్ని లవ్ ట్రాక్ లు కూడా ఉన్నాయి. అందులో చెప్పుకోవాల్సింది మాత్రం రవికృష్ణ-నవ్యస్వామి గురించే. ఇద్దరి జంటకు బాగా పాపులారిటీ ఉంది. అయితే రవికృష్ణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. నవ్యస్వామితో రిలేషన్ మీద క్లారిటీ ఇచ్చాడు.
నవ్యస్వామి నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. మా ఇద్దరి పెయిర్ బాగుందని షోలకు పిలుస్తున్నారు. మేం కూడా కంఫర్ట్ గా ఉంటుందని వెళ్తున్నాం. జనాలు కూడా మమ్మల్ని పెయిర్ గా చూస్తున్నారు. చూసేవాళ్లకు మేం లవర్స్ గా అనిపిస్తున్నాం. నవ్యస్వామితో ఇప్పటి వరకు నేను, ప్రేమ, పెళ్లి విషయాలపై చర్చించలేదు.
ఒకవేళ ఆమె ప్రపోజ్ చేస్తే చూద్దాం. నవ్యస్వామితో పెళ్లి, ప్రేమ తనకు ఇష్టమేనని పరోక్షంగా ఒప్పుకున్నాడు రవికృష్ణ. ఆయన చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. మరి ఆయన కామెంట్లపై నవ్యస్వామి ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.