Actor: ఈ స్టార్ హీరో ద‌గ్గ‌ర ఉన్న కార్ల ఖ‌రీదు తెలిస్తే బిత్త‌ర‌పోవ‌డం ఖాయం..!

Actor: సామాన్యులు లేదు, సెల‌బ్రిటీలు లేదు ఒక్కొక్క‌రికి ఒక్కో దానిపై మ‌క్కువ ఎక్కువ‌. కొంద‌రు బైక్స్‌ని ఇష్ట‌ప‌డుతుంటే మ‌రి కొంద‌రు రేసింగ్ కార్స్‌ని ఇష్ట‌ప‌డుతుంటారు. మ‌రికొంద‌రు గుర్రాల‌పై ఇష్టం చూపిస్తుంటారు. నాగ చైత‌న్య‌,అజిత్, ధోని వంటి స్టార్ సెల‌బ్రిటీస్ కార్లు, బైకుల‌ని ఎంత‌గా ఇష్ట‌ప‌డ‌తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్‌కు సైతం కార్ల‌పై మోజు ఎక్కువే. మొద‌టి నుండి కాస్ట్‌లీ కార్ల‌పై ఆస‌క్తి చూపే ఈ హీరో జూలై 6న త‌న బ‌ర్త్ డేని పుర‌స్క‌రించుకొని త‌న‌కి తానే కారుని గిఫ్ట్‌గా ఇచ్చుకున్నాడు.

ర‌ణ్‌వీర్ సింగ్ రీసెంట్ గా మెర్సిడిస్‌ మేబీచ్‌ జీఎల్‌ఎస్‌ 600ను కొనుగోలు చేసి తన ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంతకీ గత నెలలోనే భారత్‌లో లాంచ్‌ అయిన ఈ కొత్త మోడల్‌ ధర అక్షరాలా 2 కోట్ల 43 లక్షల రూపాయలు. ప్ర‌స్తుతం ఈ మోడ‌ల్‌కి ఎక్కువ డిమాండ్ ఉండ‌డంతో అంత ధ‌ర చెల్లించి ర‌ణ్‌వీర్ ఈ కారుని కొనుగోలు చేశారు. ఈ ఏడాది మేలో రణ్‌వీర్‌​ లంబోర్గిని యురుస్‌ పెరల్‌ క్యాప్సుల్‌ మోడల్‌ను తన సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. దీని ఖ‌రీదుఅక్ష‌రాలా రూ.3.15 కోట్లు.

ర‌ణ్‌వీర్ సింగ్ దగ్గర ఆస్టన్‌ మార్టిన్‌ స్పోర్ట్స్‌ కారు కూడా ఉంది. ఇది పై రెండు కార్ల ఖరీదును కన్నా ఎక్కువే. ఈ స్పోర్ట్స్‌ కారును తన వశం చేసుకోవడం కోసం అతడు ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. మొత్తంగా త‌న బ‌ర్త్‌డే రోజు కొన్న కారుతో స‌హా ర‌ణ్‌వీర్ సింగ్ ద‌గ్గ‌ర నాలుగు కార్లు ఉన్నాయి. ఏదైన మంచి మోడ‌ల్ కారు మార్కెట్‌లో దిగితే కొన‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు ఈ స్టైలిష్ హీరో.

రణ్‌వీర్‌ సింగ్‌ ప్రస్తుతం అలియాభట్‌తో కలిసి ‘రాకీ ఔర్‌ రాణీకీ ప్రేమ్‌ కహానీ’ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే స్పోర్ట్స్‌ డ్రామా ’83’లో క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ పాత్ర పోషిస్తున్నాడు. వీటితోపాటు ‘జయేశ్‌భాయ్‌ జోర్దార్‌’, ‘సర్కస్‌’, ‘అన్నియన్‌’, ‘తాకత్‌’ చిత్రాలు కూడా లైన్‌లో ఉన్నాయి. అలాగే ‘బిగ్‌ పిక్చర్‌’ అనే క్విజ్‌ షో ద్వారా త్వరలోనే బుల్లితెరపై కూడా ఎంట్రీకి సిద్ధమయ్యాడు.

రణ్‌వీర్‌.. సోషల్‌ మీడియాలో ఒక మీమ్‌ స్టఫ్‌. యాక్టింగ్‌ కంటే రణ్‌వీర్‌ జనాలకు ఎక్కువగా దగ్గరైంది త‌న‌ యాటిట్యూడ్‌తో. విచిత్రమైన అటిరే(డ్రెస్సింగ్‌ విధానం), వేషధారణలు మీడియాలో ఎప్పటికప్పుడు హాట్‌ చర్చగా మారుతుంటాయి. ఫ్యాషన్‌ విషయంలో అతనొక ట్రెండ్‌ సెట్టర్‌. అత‌ను ట్రెండ్ ఫాలో కాడు, సెట్ చేస్తాడు. కండోమ్‌ యాడ్‌లో యాక్ట్‌ దమ్మున్న హీరో రణ్‌వీర్‌ మాత్రమేనేమో!. సెటైర్‌, వరెస్ట్‌.. ఇలా ఎన్ని కామెంట్లు వినిపించినా.. విమర్శలు చుట్టుముట్టినా రణ్‌వీర్‌ మాత్రం మారడు. పైగా ఈ కోణాలన్ని ఉన్నందునే ఈ యంగ్‌ ఫైనెస్ట్‌ యాక్టర్‌ను ‘తేడా సింగ్‌’గా చూస్తూ.. ఆదరిస్తూ వస్తున్నారు అశేష అభిమానులు.