Actor Naresh : ప్రేమ వ్యవహారం కారణంగా ఆఫర్లు తగ్గుతున్నాయా?
NQ Staff - May 30, 2023 / 10:20 AM IST

Actor Naresh : హీరోగా ఒకప్పుడు పలు సినిమాల్లో నటించిన సీనియర్ నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా… కమెడియన్ రోల్స్ లో వరుసగా సినిమాల్లో నటిస్తూ వచ్చాడు. ఒకానొక సమయంలో ఏడాదికి ఇరవై నుండి ఇరవైఅయిదు సినిమాల వరకు కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి. అంతటి బిజీగా ఉన్న నరేష్ గత ఏడాది కాలంగా తక్కువ సినిమాల్లో కనిపిస్తున్నాడు.
అందుకు కారణం ఆయన యొక్క ప్రేమ వ్యవహారం అంటూ ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పవిత్ర లోకేష్ తో ఉన్న ప్రేమ వ్యవహారం మరియు రమ్య రఘుపతి నుండి విడాకుల విషయంలో ఆయన కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అందుకే ఆయన యొక్క కెరీర్ సందిగ్దంలో పడ్డట్లు అయ్యిందనే టాక్ వినిపిస్తుంది.
ఇక ప్రేమ విషయంలో నరేష్ చాలా క్లారిటీగా ఉన్నాడు. రమ్య రఘుపతి తో విడాకులు అయిన వెంటనే పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి.
ఇటీవల వీరిద్దరి కాంబోలో వచ్చిన మళ్లీ పెళ్లి పెద్ద సంచలనంగా నిలిచింది. నరేష్ మరియు పవిత్ర లోకేష్ కు సంబంధించిన ప్రేమ విషయాలను ఆ సినిమాలో చూపించారు. మొత్తానికి వ్యవహారం చాలా దూరం వెళ్లింది. ముందు ముందు పెళ్లి చేసుకుని గొడవలు తగ్గితే నరేష్ మరియు పవిత్ర లోకేష్ లు మునుపటి మాదిరిగా బిజీ అవుతారేమో చూడాలి.