Naresh And Ramya Raghupathi : రమ్యతో నాకు ప్రాణహాని ఉంది.. కోర్టును ఆశ్రయించిన సీనియర్ నటుడు నరేశ్..!
NQ Staff - January 27, 2023 / 02:25 PM IST

Naresh And Ramya Raghupathi : గత కొంత కాలంగా సీనియర్ నటుడు నరేశ్‌కు ఆయన మూడో భార్య రమ్య రఘుపతికి మధ్య విబేధాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నప్పటి నుంచే వీరిద్దరి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. నరేశ్‌కు రమ్యకంటే ముందే రెండు పెండ్లిలు అయి విడాకులు కూడా అయ్యాయి. ఇక రమ్యతో ఓ కొడుకున్న కన్న తర్వాత ఆమె నుంచి దూరంగా ఉంటూ వస్తున్నాడు.
ఈ క్రమంలోనే పవిత్రతో రిలేషన్ పెట్టుకున్నాడు. ఆమెను పెండ్లి చేసుకుంటానంటూ చెబుతున్నాడు. అయితే రమ్య కూడా ఈపెండ్లి ఎలా జరుగుతుందో చూస్తానంటూ సవాల్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు నరేశ్. రమ్య నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కోర్టును ఆశ్రయించాడు.
ఫోన్ ట్యాపింగ్..
కర్నాటకకు చెందిన రౌడీ రాకేష్ శెట్టితో రమ్య తనను చంపించాలని చూస్తోందని, ఇప్పటికే రాకేష్ తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించాడంటూ తన పిటిషన్ లో పేర్కొన్నాడు. అలాగే రమ్య ఓ పోలీస్ ఆఫీసర్ సాయంతో తన ఫోన్ ను ట్యాపింగ్ చేయించిందని, అలాగే రఘువీరారెడ్డి పేరుతో తనను బెదిరింపులకు గురి చేస్తోందంటూ వాపోయాడు.
రమ్యకు తనమీద కంటే డబ్బుల మీదనే మోజు అని, ప్రతి ఫ్యామిలీ ఫంక్షన్ లో మందు తాగి రచ్చ చేసేదంటూ పేర్కొన్నాడు. తనకు తిండి కూడా పెట్టేది కాదని.. ఇప్పుడు ఆమె వేధింపులు రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నాయని, తనకు విడాకులు ఇప్పించాలంటూ కోరుతున్నాడు నరేష్. ఆమె బెదిరింపులకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పుకొచ్చాడు నరేశ్. మరి దీనిపై రమ్య ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.