యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తెకు కరోనా పాజిటివ్

Admin - July 24, 2020 / 08:13 AM IST

యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తెకు కరోనా  పాజిటివ్

ప్రస్తుతం కరోనా ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. ఎన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ ముందుకు వెళ్తున్నప్పటికీ.. ఎలా .. ఎక్కడి .. ఎవరి ద్వారా సోకుతుందో తెలియకుండా వ్యాప్తి చెందుతూ వెళ్తుంది ఈ తరుణంలోనే కొంతమంది రాజకీయ నాయకులకు, సినీ ప్రముఖులకు సైతం కరోనా సోకిన విషయం అందరికీ తెలిసిందే

ఇక తాజాగా యాంక్షన్ కింగ్ అర్జున్ కూతురు అయినటువంటి ఐశ్వర్య అర్జున్ కి కూడా కరోనా సోకడం జరిగింది. ప్రస్తుతం తనని చెన్నైలోని ఒక ప్రముఖ హాస్పిటల్ లో చేర్పించగా వైద్యుల సంరక్షణలో తాను చికిత్స పొందడం జరుగుతుంది. అయితే ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉండే అర్జున్ తన కూతుర్ల విషయాలలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. కానీ ఇలా ఊహించని విధంగా తన కూతురికి సైతం కరోనా సోకడం తో ఒక్క సారిగా షాక్ కి గురయ్యాడు అర్జున్.

ఇలా తన కూతురికి కరోనా సోకడం తో తన కుటుంబ సబ్యులకు సైతం కరోనా పరీక్షలు నిర్వహించగా మిగిలిన వారందరికీ నెగిటివ్ రావడం జరిగింది అంట. దానితో అర్జున్ కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఐశ్వర్య విషయం లో ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఇక ఐశ్వర్య ఇప్పటికే తమిళ్ మరియు కన్నడ భాషల్లో నటించడం జరిగింది. తన పరిస్థిని పరీశిలించిన వైద్యులు ఐశ్వర్య కరోనా ని జయించి
త్వరలోనే కోలుకుంటుంది అని తెలియచేయడం జరిగింది.

Read Today's Latest Videos in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us