Actor Kamal Kamaraju : దరిద్రమైన పని చేస్తూ పోలీసులకు దొరికిన నటుడు కమల్ కామరాజు..!
NQ Staff - January 21, 2023 / 09:21 AM IST

Actor Kamal Kamaraju : చట్టాలు అనేవి అందరికీ ఒకే విధంగా ఉంటాయనేది ఎన్నోసార్లు నిరూపితం అయింది. అది సెలబ్రిటీల విషయంలో కూడా ఒకేలా ఉంటుందని నిరూపితం అయింది. అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా తప్పతాగి పోలీసులకు దొరికిన సందర్భాలు మనం అనేకం చూశాం. ఇక తాజాగా మరో నటుడు కూడా పోలీసులకు దొరికిపోయాడు. ఆయన చేసిన చెత్త పనికి పోలీసులకు చిక్కాడు.
ఆయన ఎవరో కాదండోయ్ ప్రముఖ నటుడు కమల్ కామరాజు. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఆయన ఆవకాయ్ బిర్యానీ, ఛత్రపతి, గోదావరి లాంటి సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. కాటరాయుడు సినిమాలో కూడా పవన్‌కు తమ్ముడిగా నటించాడు.
సోషల్ మీడియలో వైరల్..
ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తున్నాడు ఈ హీరో. అయితే ఆయన తాజాగా పోలీసులకు దొరకిపోయాడంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపాడు. ఇందుకు సంబంధించిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆయన ట్వీట్ చేస్తూ.. ‘‘అందరికీ చెప్తాను. ఇవాళ నా బైక్ స్పీడు పెంచి దొరికిపోయాను. పొద్దున్నే ఖాళీ రోడ్ చూసి 60లో వెళ్లాల్సిన నేను ఆతృత ఆపుకోలేక 80లో వెళ్లాను. ఇంత మార్నింగ్ సమయంలో నేను స్పీడుగా వెళ్తున్నా కూడా పట్టుకుని నాకు చలాన్ పంపిన హైదరాబాద్ పోలీసులకు ధన్య వాదాలు అంటూ తెలిపాడు. అంతే కాకుండా యన స్పీడుగా వెళ్తున్న బైక్ ఫొటోను కూడా పోస్టు చేశాడు.
అందరికి చెప్తా… ఇవ్వాళా నా బైక్ స్పీడ్ పెంచి దొరికిపోయా . పోదున్నే కాళీ రోడ్ చూసి excite అయ్యి 60 లొ వవెళ్ళాలి 80 లొ వెళ్ళా. kudos to hyderabad traffic police and their advanced methods for capturing and sending me a challan even at such early hours. @hydcitypolice @HYDTP pic.twitter.com/KSuP5rvkVM
— kamal kamaraju ~k k (@kamalkamaraju) January 19, 2023