Kamal Haasan : సినీ నటుడు కమల్ హాసన్‌కి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు.!

NQ Staff - November 24, 2022 / 02:55 PM IST

Kamal Haasan  : సినీ నటుడు కమల్ హాసన్‌కి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు.!

Kamal Haasan  : ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ అస్వస్థతకు గురయ్యారు. నిన్ననే హైద్రాబాద్ వచ్చిన కమల్ హాసన్, ప్రముఖ సినీ దర్శకుడు కె. విశ్వనాథ్‌ని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న సంగతి తెలిసిందే.

విశ్వనాథ్, కమల్ హాసన్‌కి సినీ గురువు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న విశ్వనాథ్‌ని పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు కమల్ హాసన్.

హైద్రాబాద్ నుంచి చెన్నయ్ తిరిగి వెళ్ళాక, ఒంట్లో కాస్త నలతగా వుండటంతో ప్రాథమిక వైద్య చికిత్స చేయించుకున్నారు. జ్వరం తగ్గకపోవడంతో ఆసుపత్రిలో చేరారు కమల్ హాసన్. వైద్యులు ఆయనకు పలు రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఆసుపత్రిలో చేరిక, డిశ్చార్జి..

నిన్న సాయంత్రం ఆసుపత్రిలో చేరిన కమల్‌కి పలు రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించి, రాత్రంతా ఆసుపత్రిలోనే అబ్జర్వేషన్‌లో వుంచినట్లు తెలుస్తోంది. కాగా, ఈ రోజు ఉదయం కమల్ హాసన్‌ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

కమల్ ఆసుపత్రిలో చేరారన్న ప్రచారంతో ఒక్కసారిగా సినీ వర్గాల్లో కలకలం బయల్దేరింది. తీవ్ర అనారోగ్యంతో కమల్ బాధపడుతున్నారంటూ తమిళనాట గాసిప్స్ గుప్పుమన్నాయి. కమల్ హాసన్, మక్కల్ నీది మయ్యం అనే రాజకీయ పార్టీని నడుపుతున్న సంగతి తెలిసిందే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us