గుండె పోటుతో కన్నుమూసిన జయప్రకాష్ రెడ్డి

Advertisement

రాయలసీమ యాసలో విలనిజాన్ని, కామెడీని పండించి తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన నటుడు జయప్రకాష్ రెడ్డి(73) ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. లాక్ డౌన్ వల్ల గుంటూరు ఉంటున్న ఆయన అక్కడే మరణించారు. 1946 మే 23న కర్నూల్ జిల్లాలోని ఆళ్లగడ్డ మండలంలోని సిరివేళ్ళ గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుండి కూడా జయప్రకాష్ నారాయణ నాటకాలు వేస్తూ ఉండేవారు.

జయప్రకాష్ నారాయణ మొదట ఎస్ఐగా విధులు నిర్వహించారు. తరువాత నటనపై ఆసక్తితో మూవీస్ లోకి వచ్చారు. బ్రహ్మపుత్రుడు మూవీతో సినీ రంగ ప్రవేశం చేశాడు. అయితే ప్రేమించుకుందాం రా మూవీతో సినీ పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకున్నారు. నరసింహా రెడ్డి, సమరసింహ రెడ్డి, జయం మనదేరా వంటి చిత్రాలతో విలన్ గా తెలుగు ప్రేక్షకులను బయపెట్టారు. అలాగే జయప్రకాష్ రాయలసీమ యాసలో చేసే కామెడీ కూడా తెలుగు ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేరు. రెడి మూవీలో ఆయన చేసిన కామెడీ ఎప్పటికి నిలిచిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here