బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలి : హీరో అర్జున్

Admin - September 26, 2020 / 11:08 AM IST

బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలి : హీరో అర్జున్

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ లోకాన్ని వదలి స్వర్గస్థులు అయిన విషయం తెలిసిందే. అయితే చెన్నైలోని తామరైపాక్కంలో ఉన్న ఆయన ఫాం హౌజ్‌లో ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీబీ అంత్యక్రియలు జరిగాయి. ఇక వైదిక శైవ సంప్రదాయం ప్రకారం క్రతువుతో ఆయనను సమాధి చేశారు. ఆయన మరణంతో సంగీత లోకం లో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారత రత్న ఇవ్వాలని హీరో అర్జున్ డిమాండ్ చేశారు.

అలాగే భారత రత్నకు బాలు కు అన్ని అర్హుడు ఉన్నాయని తెలిపారు. తాను పాడే పాటలో చిన్న డబల్ మీనింగ్ ఉన్నా ఆయన ఆ పాట పడేవారు కాదని అర్జున్ తెలిపారు. దాదాపు 45 వేల పాటలు పాడారని అన్నాడు. అలాగే రెండు జన్మలు ఎత్తినా ఇంకెవ్వరు ఈ పాటలు పాడలేరని అర్జున్ అన్నారు. ఆయనకు భారతరత్న కోసం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా ఇండస్ట్రీలు అన్నీ కూడా కలిసి పోరాడాలని హీరో అర్జున్ సూచించాడు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us