Rohini : ఆ నటుడితో ప్రేమలో పడ్డ జబర్దస్త్ రోహిణి.. పబ్లిక్ గా బయట పడ్డ యవ్వారం..!
NQ Staff - January 26, 2023 / 01:39 PM IST

Rohini : బుల్లితెరపై ఇప్పుడు రోహిణి హవా మామూలుగా ఉండట్లేదు. వరుస ఈవెంట్లతో దూసుకుపోతోంది. ఆమె ఇప్పుడు జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చేస్తోంది. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోను రిలీజ్ చేశారు. తాజా ఎపిసోడ్‌కు బుట్ట బొమ్మ చిత్ర యూనిట్ హాజరయింది. అయితే హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమాలో ఒక విలన్ గా చేసిన అర్జున్ దాస్ కూడా బుట్టబొమ్మ మూవీలో నటిస్తున్నాడు.
ఈ ప్రోమో ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. ఎప్పటి లాగే ఆటపాటలు, డ్యాన్స్, ఫోక్ సాంగ్స్ పాడే ఆర్టిస్టులతో ప్రోమో సాగింది. ఆటో రాంప్రసాద్, నరేష్, బుల్లేట్ భాస్కర్, రోహిణిల కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. ఇక రోహిణి అయితే భీమ్లా నాయక్ సాంగ్‌కు అదిరిపోయే మాస్ స్టెప్పులు వేసేసింది.
ఆమెను ఎత్తుకుని తిప్పుతూ..

Actor Arjun Das Romanced Rohini
అయితే ఇందులో కుర్చీలాట కూడా బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ కుర్చీలాటలో సీరియల్స్ హీరోయిన్ అయిన నవ్యస్వామిని అర్జున్ దాస్ ఎత్తుకున్నాడు. వారిద్దరి మధ్య ఓ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఆకట్టుకుంది. అయితే అంతలోనే రామ్ ప్రసాద్ రోహిణిని పిలుస్తాడు.
ఆమెను చూడగానే కాస్త భయపడుతున్నట్టు ఫేస్ అమాయకంగా పెడుతాడు అర్జున్ దాస్. అయినా సరే ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని రోహిణిని ఎత్తుకుని కుర్చీల చుట్టూ తిరుగుతాడు. దాంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. రొమాంటిక్ గా అతడి చేయి పట్టుకుని చూసింది రోహిణి. అర్జున్ దాస్ కూడా ఆమె ప్రేమని అంగీకరించినట్లు చూసి వెంటనే దండం పెట్టాడు. దాంతో అందరూ నవ్వేశారు.