Actor Aditya Om Comments Viral : ఇండియాలోనే బన్నీ నెంబర్ వన్ హీరో.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్ ఇది..!

NQ Staff - July 17, 2023 / 09:50 AM IST

Actor Aditya Om Comments Viral : ఇండియాలోనే బన్నీ నెంబర్ వన్ హీరో.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్ ఇది..!

Actor Aditya Om Comments Viral :

పాన్ ఇండియా స్టార్లు ఈ నడుమ మన సౌత్ నుంచే ఎక్కువగా పుట్టుకు వస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నార్త్ హీరోలను మించి మనోళ్ల సినిమాలకు కలెక్షన్లు వస్తున్నాయి. దాంతో బాలీవుడ్ స్టార్లు కూడా మనోళ్ల క్రేజ్ ముందు తేలిపోతున్నారు. ఇక రాజమౌళి లాంటి డైరెక్టర్ల సపోర్టు లేకపోయినా సరే.. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అల్లు అర్జున్.

పుష్ప సినిమా ఆయన మార్కెట్ ను అమాంతం మార్చేసింది. అప్పటి నుంచి బన్నీ ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక కొన్ని సర్వలల్లో కూడా ఇండియాలోనే ప్రముఖమైన ర్యాంకులు దక్కించుకుంటున్నాడు ఈ హీరో. ఇక తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆదిత్య ఓం చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి.

వీడియో వైరల్..

ఆయన ఓ వీడియోలో మాట్లాడుతూ.. నార్త్ ఇండియాలో బన్నీ క్రేజ్ చూస్తుంటే మతిపోతోంది. ఆయన ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ హీరో. ప్రభాస్ నెంబర్ 2, యష్ నెంబర్ 3 హీరోలు అని స్టేట్ మెంట్ ఇచ్చేశౄడు. ఈ వీడియో చూసిన బన్నీ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. తగ్గేదే లే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 Actor Aditya Om Comments Viral

Actor Aditya Om Comments Viral

ఇక ఈ వీడియోను చూసిన ఇతర స్టార్ హీరోల ఫ్యాన్స్.. వల్గర్ కామెంట్లు పెడుతున్నారు. అసలు బన్నీ నెంబర్ వన్ హీరో ఏంటి.. ప్రభాస్, రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌ లు ఇప్పటికే గ్లోబల్ స్థాయికి వెళ్లిపోయారు. అలాంటప్పుడు బన్నీని ఎలా నెంబర్ వన్ అని అంటారంటూ ఆడేసుకుంటున్నారు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us