ఏసీపి ఇచ్చిన కౌంటర్ కు స్పందించిన రామ్ ఏమన్నాడో తెలుసా..!

Advertisement

టాలీవుడ్ యువనటుడు రామ్ పోతినేని ఇటీవల ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే విజయవాడ లో రమేష్ హాస్పటల్ వారు కరోనా క్వారంటైన్ నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ ఆసుపత్రి స్వయాన రామ్ బాబాయిది. ఇక ఈ ఆసుపత్రి విషయం పై స్పందించిన రామ్ పై విజయవాడ ఏసీపి సూర్యచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ.. అవసరమైతే రామ్ కు కూడా నోటీసులు పంపుతామని అన్నాడు.

ఇక ఈ విషయం పై తాజాగా రామ్ కూడా స్పందిస్తూ.. రమేష్ హాస్పటల్ వ్యవహారంపై ఇంకా ఎప్పుడు ట్వీట్ లు చేయనని అన్నాడు. ఇప్పటికే నేను చెప్పాల్సింది చెప్పేశా.. మిగితాది అంత కూడా ప్రభుత్వం చూసుకుంటుంది. న్యాయం పై నాకు నమ్మకం ఉందని అన్నాడు రామ్. అలాగే దోషులకు తప్పకుండా శిక్ష పడుతుందని రామ్ పోతినేని వ్యాఖ్యానించాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here