‘ఆచార్య’ షూటింగ్ మరో 2 నెలలు వాయిదా

Admin - September 22, 2020 / 12:54 PM IST

‘ఆచార్య’ షూటింగ్ మరో 2 నెలలు వాయిదా

టాలీవుడ్ లో ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య మూవీ ఒకటి. అయితే కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. కానీ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో షూటింగ్‌ వాయిదా పడిన విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సినిమా చిత్రీకరణ మల్లి ఎప్పుడు మొదలవుతుందో అనే దాని పై ఇంతవరకు ఎటువంటి స్పష్టత లేదు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని కొరటాల, చిరంజీవి భావిస్తున్నట్టు ఇప్పటికే కొని వార్తలు వచ్చాయి.

తాజాగా మరి కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే మరో 2 నెలల వరకు సినిమాను సెట్స్‌ పైకి తీసుకెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలిస్తే నవంబర్ రెండవ వారం తరువాత ఆచార్య షూటింగ్ ను ప్రారంభించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ నెలలో విడుదల కావాల్సింది. కానీ కరోనా, లాక్ డౌన్ తో సినిమా షూటింగ్స్ కు అంతరాయం కలగడంతో..ఇక 2021 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us