మరో మెగా బ్రేకింగ్ : ‘ఆచార్య’ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది..

‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తర్వాత చిరంజీవి నుంచి మళ్లీ ఎప్పుడు మూవీ వస్తుందా అని వెయిట్ చేస్తున్న మెగా అభిమానులకు శుభవార్త. ‘ఆచార్య’ టీజర్ ని ఇవాళ సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేసి ఫ్యాన్స్ ని ఫిదా చేసిన ఆ సినిమా యూనిట్ గంటన్నర వ్యవధిలోనే మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని వచ్చే ఎండాకాలంలో థియేటర్లలోకి తేవాలని నిర్ణయించారు.

కమాన్..

‘ఆచార్య’ మూవీ కోసం చిరంజీవి అభిమానులు మాత్రమే కాదు.. అందులో హీరోగా చేసిన మెగాస్టార్ కూడా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. టీజర్ రిలీజ్ కోసం దర్శకుడు కొరటాల శివ మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చిన ఆయన ఎట్టకేలకు ఆ డేట్ ని, చివరికి టీజర్ నీ విడుదల చేయించి ప్రేక్షకులను అలరించారు. ఇదే క్రమంలో మూవీ రిలీజ్ డేట్ నీ ప్రకటించటం గమనార్హం.

హీట్.. హీట్..

కరోనా నేపథ్యంలో షూటింగులు, రిలీజులు ఆగిపోయిన సినిమాలన్నీ ఇప్పుడు వరుస కడుతున్నాయి. చిరంజీవి, వెంకటేష్, పవన్ కళ్యాణ్ వంటి పెద్ద హీరోలతోపాటు చిన్న హీరోల సినిమాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తుండటం పట్ల సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement