Acharya : ఆచార్య సినిమాకి దర్శకుడు కొరటాల శివ కాదా ..?

Acharya : ఆచార్య .. మెగాస్టార్ చిరంజీవి కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా. మెగా పవర్ స్టార్ రాం చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ – కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్స్ లో రాం చరణ్ – నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలావరకు ఆచార్య చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. ఆచార్య.. కొరటాల శివ శైలిలోనే సామాజిక అంశాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి.. మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా రూపొందిస్తున్నాడు. మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే ఆచార్య సినిమా ఎలా ఉండబోతుందో అన్న అంచనాలు పెరిగాయి.

acharya-is koratala siva not directing acharya...?
acharya-is koratala siva not directing acharya…?

కాని తాజాగా ఆచార్య సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ కి పాజిటివ్ కామెంట్స్ తో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. పాజిటివ్ కామెంట్ ఎన్ని వచ్చినా కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తే మాత్రం ఇక ప్రతీ ఒక్కరు అవి పట్టుకొనే దర్శక, నిర్మాతలను ట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు ఆచార్య సినిమా విషయంలో కూడా నెటిజన్స్ గట్టిగా ట్రోల్ చేస్తున్నారట. కొరటాల శివ నుంచి మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు వచ్చి భారీ కమర్షియల్ సక్సస్ లు గా నిలిచాయి.

Acharya : చిరంజీవి – రాం చరణ్ లతో కొరటాల ఇలాంటి సినిమానా తీస్తున్నాడా ..!

దాంతో తాజాగా కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య మీద ఊహించని విధంగా అంచనాలు ఏర్పడ్డాయి. కాని తాజాగా రిలీజైన టీజర్ తో మెగా అభిమానులు షాక్ కి గురయ్యారని చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు కొరటాల నుంచి వచ్చిన సినిమాల స్థాయి ఆచార్య సినిమా టీజర్ లో కనిపించలేదని చెప్పుకుంటున్నారు. అంతేకాదు చిరంజీవి – రాం చరణ్ లతో కొరటాల ఇలాంటి సినిమానా తీస్తున్నాడు అని ట్రోల్ చేస్తున్నారట. అసలు కొంతమంది అయితే ఈ సినిమాని కొరటాల శివ నే తెరకెక్కిస్తున్నాడా అని కామెంట్స్ చేస్తున్నారట. అంటే టీజర్ టాక్ ఎంటో అర్థం చేసుకోవచ్చు.

Advertisement