Acham Naidu : భలే ఇరుకున్నాడు గా , జగన్ కి ఫుల్ హ్యాపీ సీన్ ఇది – అచ్ఛెన్నాయుడు కేసులో సీరియస్ ఇష్యూ !

acham naidu

Acham Naidu: మాజీమంత్రి అచ్ఛెన్నాయుడు మీద వంద‌ల కోట్ల రూపాయ‌ల విలువైన ఈఎస్ఐ స్కామ్ విషయంలో ఆరోపణలు ఉన్నట్లు అందరికి తెలిసిందే. అయితే ఆ ఈఎస్ఐ స్కామ్ విషయంలో అచ్ఛెన్నాయుడుకి జైలు శిక్ష కూడా విధించారు. కానీ కొన్ని గంటల పాటు కూడా జైలులో గ‌డిపలేదు. అరెస్టు అయిన కొద్దిసేపటికే సినీమా స్టోరీలాగా త‌న‌కు ఆరోగ్యం క్షిణించిందని చెప్పడంతో కోర్టు ఆదేశాల మేర‌కు అరెస్టు చేసిన వెంట‌నే అచ్చెన్నాయుడిని పోలీసులు ప్ర‌భుత్వాసుప‌త్రికి తరలించారు. అక్కడ కొన్ని రోజుల పాటు ప్ర‌భుత్వాసుప‌త్రిలో కొన్ని రోజుల పాటు చికిత్స పొందిన అచ్ఛెన్నాయుడును సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారంటూ ప్ర‌భుత్వాసుప‌త్రి వైద్యులు ధ్రువీక‌రించి పంపించేశారు.

మళ్ళీ అక్కడనుంచి అచ్ఛెన్నాయుడు జైలుకి వెళ్ళడా.. అంటే అది లేదు. వెంటనే ప్ర‌భుత్వాసుప‌త్రిలో చికిత్స అనంత‌రం మళ్ళీ ఏవో కహానీలు చెప్పి ప్రైవేట్ ఆసుప‌త్రికి చేరుకున్నారు. కోర్టు ఆదేశాల‌తో అచ్ఛెన్నాయుడును ర‌మేష్ ఆసుప‌త్రికి చేర్పించారు పోలీసులు. అలా కొన్నాళ్ల పాటు అక్కడ లగ్జరీ లైఫ్ గడిపాక బెయిల్ తెచ్చుకుని తిన్నగా ఇంటికి పయనం అయి వెళ్ళిపోయాడు.

ఇలా వంద‌ల కోట్ల రూపాయ‌ల స్కామ్ విషయంలో అరెస్ట్ అయినాగానీ తన పలుకుబడి, తెలివితేటలు ఉపయోగించుకుని కొన్ని రోజుల పాటు అయిన జైలులో ఉండకుండా అన్నీ సదుపాయాలు ఉండే ఆసుప‌త్రిలో అబద్దపు రోగిలాగా గడిపాడు అచ్ఛెన్నాయుడు. కానీ ఇప్పుడు మాత్రం అచ్ఛెన్నాయుడుకి ఆ ఛాన్స్ లేదు. ఒక పంచాయ‌తీ ప్రెసిడెంట్ అభ్య‌ర్థిని ఫోన్లో బెదిరించిన వ్య‌వ‌హారంలో ఆయ‌న‌ను అరెస్టు చేసి జైల్లో ఉంచారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా జైల్లో అచ్ఛెన్నాయుడు రిమాండ్ ఖైదీ దుస్తుల‌తో ఉన్నారట. అచ్చెన్నాయుడికి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగ‌తి తెలిసిందే. ఆ క్రమంలోనే జైలు దుస్తులతో ఉన్నారట. మ‌రి ఈసారి ఏమి కధ చెప్పి తప్పించుకుంటాడో చూడాలి.

Advertisement