Acham Naidu : అచ్చెన్నాయుడు ఓపెన్ గా పబ్లిక్ గా చంద్రబాబు ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ? షాక్ లకే షాక్ ఇది ?

Acham Naidu : ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చంద్రబాబు ని పరోక్షంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే వాదనలు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి. ఐతే టీడీపీ పార్టీకి అత్యంత విశ్వాసపాత్రుడు అయిన అచ్చెన్న చంద్రబాబు ని బ్లాక్మెయిల్ చేయడమేంటనే ప్రశ్నలు రావడం సహజం. ఎందుకు, ఏమిటీ అనేది ఈ ఆర్టికల్ లో వివరంగతెలుసుకుందాం

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్థి గా నామినేషన్ వేసిన ఒక వ్యక్తి పై అచ్చెన్నాయుడు బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఓ కేసు నమోదు అయ్యింది. అయితే మంగళవారం రోజు పోలీసులు నిమ్మాడలో అచ్చెన్నాయుడు నివాసానికి వెళ్లి ఆయన్ని అరెస్టు చేసి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరు పరిచారు. అయితే తాను ఏ బెదిరింపులకు పాల్పడలేదని.. పోలీసులు తప్పుడు కేసులు పెట్టి దౌర్జన్యానికి దిగుతున్నారని అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. ఖాకీ డ్రెస్ అంటేనే విరక్తి వస్తోందని.. స్థానిక డీఎస్పీ, సీఐలు వైసీపీ కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తప్పుడు కేసులు పెడుతున్న ప్రతి ఒక్క పోలీస్ ని వదిలే ప్రసక్తే లేదని.. రేపు అధికారంలోకి వచ్చేది తామే అని.. చంద్రబాబు కి చెప్పి తాను హోం మంత్రి అవుతానని ఆయన వ్యాఖ్యనించారు.

అయితే అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వెనుక చాలా అర్థం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన ఎప్పట్నుంచో హోంమంత్రి కావాలని ఆశ పడుతున్నారని.. 2014 సంవత్సరంలో కూడా హోం మంత్రి పదవిని చంద్రబాబు కట్టబెడతారని అచ్చెన్న ఆశపడ్డారని పరిశీలకులు అంటున్నారు. టీడీపీ పార్టీలో ఉన్నందుకే రెండు సార్లు జైలుకు వెళ్లాల్సి వచ్చిందని.. పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్న తనకు ఈసారి ఎలాగైనా హోం మంత్రి పదవి ఇవ్వాలని ప్రత్యక్షంగానే అచ్చెన్నాయుడు చంద్రబాబు ని లాక్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తే తనకు హోం మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని అచ్చెన్న చంద్రబాబు ని బ్లాక్మెయిల్ చేస్తున్నారనే వాదనలు కూడా జోరుగా వినపడుతున్నాయి. గతంలో విశాఖపట్నంలో జగన్ డైలాగ్ కొట్టి సీఎం అయినట్టు.. అచ్చెన్న కూడా డైలాగ్ కొట్టి హోం మంత్రి అవుతారా? అంటే కాలమే సమాధానం చెప్పాలి.

Advertisement