Pawan Kalyan : జనసేన సొంత సర్వే.. దాన్ని బట్టి పొత్తుల ఆలోచన
NQ Staff - May 27, 2023 / 08:32 AM IST

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. పార్టీ ప్రారంభించి మొదటి సారి బిజెపి, టిడిపికి మద్దతు ఇచ్చిన జనసేన ఆ తర్వాత 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసిన విషయం తెలిసిందే.
ఆ ఎన్నికల్లో దారుణమైన పరాజయాన్ని మూట కట్టుకోవాల్సి వచ్చింది. అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఓటమిపాలయ్యాడు. ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలుపొందిన విషయం కూడా తెలిసిందే. అందుకే వచ్చే సంవత్సరం జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు జనసేన అధినేత భయపడుతున్నట్లుగా గుసగుసలు అనిపిస్తున్నాయి.
బీజేపీ మరియు తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లాలని ఆయన భావిస్తున్నాడట. మరో వైపు పార్టీ నాయకులతో మరియు సన్నిహిత మీడియా వ్యక్తులతో వేరు వేరుగా రెండు సర్వేలను చేయించి 2019 కి ఇప్పటికి బలం ఎంత అనేది చూసుకోవాలని భావిస్తున్నాడట.
సర్వే ఫలితాలను బట్టి పొత్తు విషయంలో తుది ఫలితం తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు అని తెలుస్తుంది. బలం భారీగా పెరిగింది అంటే ఒంటరిగా వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.