NTV : ఎన్టీవీ మళ్లీ నెం.1 న్యూస్ ఛానల్‌

NQ Staff - June 1, 2023 / 08:31 PM IST

NTV : ఎన్టీవీ మళ్లీ నెం.1 న్యూస్ ఛానల్‌

NTV : గత వారం టీవీ9 నెం.1 స్థానంలో నిలువగా ఈ వారం ఆ నెం.1 స్థానంను ఎన్టీవీ సొంతం చేసుకుంది. 20వ వారంలో టీవీ9 62.5 పాయింట్స్ తో ప్రథమ స్థానంలో నిలువగా స్వల్ప తేడా 61.4 పాయింట్లతో రెండవ స్థానంలో నిలవడం జరిగింది. ఇక 21వ వారంలో ఎన్టీవీ మళ్లీ సత్తా చాటింది.

తాజాగా వెళ్లడి అయిన బార్క్‌ రేటింగ్స్ ప్రకారం ఈవారం అయిదు పాట్లను అదనంగా దక్కించుకుని ఎన్టీవీ 66.5 పాయింట్స్‌ తో నెం.1 స్థానంలో నిలిచింది. టీవీ9 మాత్రం నాలుగు పాయింట్లు కోల్పోయి 58.7 పాయింట్లతో నెం.2 స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఎన్టీవీ యాజమాన్యం స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేసింది.

”ప్రతి క్షణం-ప్రజా హితం” అనే స్లోగ‌న్‌ను పెట్టుకుని, కేవ‌లం దాన్ని స్లోగ‌న్‌గా వ‌దిలేయ‌కుండా ప్రతి క్షణం ఆ మాట‌ మీద ఉండ‌ట‌మే ఎన్టీవీ ఈ స్థానానికి రావ‌డానికి కార‌ణం. దేనికీ బెద‌ర‌కుండా, ఎవ‌ర్నీ బెదిరించ‌కుండా ప్రజ‌ల పక్షాన నిల‌బ‌డుతుండ‌ట‌మే ఎన్టీవీని తెలుగు మీడియా రంగంలో మేటిగా నిల‌బెడుతుంది. కాగా, ఎన్టీవీ నెం.1గా నిల‌వ‌డంతో ఎన్టీవీ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us