Chandrababu : చంద్రబాబుకు గుడ్ న్యూస్.. కోర్టులో లక్ష్మీ పార్వతికి చుక్కెదురు

Chandrababu : ఓవైపు చంద్రబాబుకు ఒకేసారి గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ రెండూ తెలిశాయి. ఒకటేమో నోటుకు ఓటు కేసులో ఆ గొంతు చంద్రబాబుదేనని కోర్టు ధృవీకరించగా… మరోవైపు అదే ఏసీబీ కోర్టు.. చంద్రబాబునాయుడుపై దాఖలైన పిటిషన్ ను కొట్టేసింది. చంద్రబాబు ఆస్తులపై విచారణ చేయాలని… దాని కోసం ఏసీబీని విచారణకు ఆదేశించాలని… 2005 లో వైసీపీ నేత లక్ష్మీ పార్వతి పిటిషన్ దాఖలు చేశారు.

acb court dismisses laxmi parvathi petition against chandrababu naidu
acb court dismisses laxmi parvathi petition against chandrababu naidu

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి ఆయనకు ఆస్తులున్నాయని.. లక్ష్మీ పార్వతి అప్పట్లో ఏసీబీ స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఫిర్యాదు చేశారు. అయితే… ఏసీబీ స్పెషల్ కోర్టు లక్ష్మీ పార్వతి పిటిషన్ పై విచారణ ప్రారంభం చేయకముందే… చంద్రబాబు.. దానిపై ఇంప్లీడ్ పిటిషన్ ను దాఖలు చేశారు. దానిపై ఏసీబీ కోర్టు సీరియస్ అయింది. చంద్రబాబు ఇంప్లీడ్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు తోచి పుచ్చడంతో.. వెంటనే చంద్రబాబు హైకోర్టులో దానిపై రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 2005 లోనే ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఏసీబీ కోర్టులో ఆ పిటిషన్ కు సంబంధించిన విచారణను నిలిపేయాలని స్టే విధించింది.

తాజాగా… ఆ పిటిషన్ పై మరోసారి విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు…. లక్ష్మీ పార్వతి చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని.. పిటిషన్ ను కొట్టేసింది. దీంతో చంద్రబాబుకు అది గుడ్ న్యూస్ అయింది.. లక్ష్మీ పార్వతికి బ్యాడ్ న్యూస్ అయింది.

Advertisement