కరోనాకు వ్యాక్సిన్ ఇప్పట్లోనే వచ్చే అవకాశం లేదు: WHO ప్రతినిధి
Admin - September 4, 2020 / 12:41 PM IST

కరోనా వల్ల ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. కరోనా రోజురోజుకు వేలమంది ప్రాణాలను బాలి తీసుకుంటుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనాకు వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నాయి. మూడో దశ ప్రయోగాలు పూర్తి కాకుండానే ఇప్పటికే రష్యా, అమెరికా లాంటి దేశాలు వ్యాక్సిన్ వచ్చిందని ప్రకటించాయి. అయితే ఇవ్వాళ ప్రెస్‌మీట్ నిర్వహించిన WHO ప్రతినిధి మాట్లాడుతూ…కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనేలా విస్తృత వ్యాక్సినేషన్‌ను 2021 మధ్యకాలం వరకు చూస్తామని కూడా తాము భావించడంలేదని మార్గరెట్ హ్యారిస్ అన్నారు.
ఇప్పటికే వ్యాక్సిన్ ను డెవలప్ చేశామని చెప్తున్న ఔషధ సంస్థల వ్యాక్సిన్స్ యొక్క మూడో దశ ప్రయోగాలు పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందని, అలాగే అవి ఎంత ప్రభావితంగా పనిచేస్తాయో కూడా చెక్ చేయాలని, అలాగే వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ను స్టడీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించింది. నాణ్యత లేని వ్యాక్సిన్ తో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టలేమని అధికారులు వెల్లడించారు.