AB de Villiers’ son: తండ్రి ఔట్ అయ్యాడ‌న్న కోపం.. కుర్చీని గ‌ట్టిగా కొట్టిన స్టార్ క్రికెట‌ర్ కొడుకు

AB de Villiers’ son: ఐపీఎల్ 2021 సీజన్ సెకండ్ ఫేజ్ చాలా ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. మ్యాచ్‌లు పోటీపోటీగా జ‌రుగుతున్నాయి. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు .. ముంబయి ఇండియన్స్‌తో దుబాయ్ వేదికగా మ్యాచ్ ఆడింది. తొలుత బ్యాటింగ్.. ఆ తర్వాత బౌలింగ్‌లో సత్తాచాటిన బెంగళూరు టీమ్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది.

AB de Villiers' son punches his hand on chair in disappointment, hurts himself after his father got out
AB de Villiers’ son punches his hand on chair in disappointment, hurts himself after his father got out

తొలుత గ్లెన్ మాక్స్‌వెల్ (56: 37 బంతుల్లో 6×4, 3×6), విరాట్ కోహ్లీ (51: 42 బంతుల్లో 3×4, 3×6) హాఫ్ సెంచరీలు బాదడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీమ్ 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ముంబయి టీమ్‌ 18.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టగా.. చాహల్ మూడు, మాక్స్‌వెల్ రెండు వికెట్లు తీసి.. ముంబయి పతనాన్ని శాసించారు.

అయితే ముంబైతో మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ 19 ఓవర్‌ వేసిన జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఏబీ డివిలియర్స్ వికెట్‌ కీపర్‌ డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. అయితే చెలరేగి ఆడతాడు అనుకున్న డివిలియర్స్ మరోసారి అభిమానులను నిరాశ పరిచాడు. త‌న తండ్రి త‌క్కువ స్కోరుకి ఔట్ కావ‌డం ఆయ‌న కొడుకుని కూడా బాధించింది.

డివిలియ‌ర్స్ ఔట్ కావ‌డంతో తన ముందు వరుసలో ఉన్న కుర్చీపై చేతితో బలంగా గుద్దాడు. అయితే, కొడుకు రియాక్షన్‌ చూసి పక్కన ఉన్న అతని తల్లి షాక్‌కు గురైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ మ్యాచ్‌లో 6 బం‍తులు మాత్రమే ఎదుర్కొన్న ఏబీడీ 11 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు.