ఒక్కోసారి గ్రౌండ్లో జరిగనే సరదా సంభాషణలు, సన్నివేశాలు వీక్షకులతో పాటు నెటిజన్స్‌కు పసందైన వినోదాన్ని అందిస్తుంటాయి. కామెడీలు చేస్తుండడం, ఒకరిపై ఒకరు పంచ్‌లు వేసుకోవడం, ఎదుటి వారిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్ ఔట్ అయితే డ్యాన్స్ లు చేయడం ఈ మధ్య కాలంలో కామన్‌గా మారింది. ఐపీఎల్ వలన క్రికెటర్స్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ కూడా నెలకొంది. ఈ క్రమంలో నేడు సిడ్నీ క్రికెట్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఫింఛ్ పరుగుల వరద పారిస్తుండగా, భారత బౌలర్ సైనీ ఇన్నింగ్స్‌లోని 11.5వ బంతిని సంధించాడు. 145.6 కి.మీ వేగంతో దూసుకొచ్చిన ఆ బంతి కాస్త కెప్టెన్ ఆరోన్ ఫించ్ పొట్టకి తాకింది. దీంతో అందరు గాయపడ్డాడేమో అని భయపడ్డారు కాని అదృష్టవశాత్తు ఎమి కాలేదు. చేయి జారి అలా తాకడంతో వెంటనే సైనీ ..ఫించ్ దగ్గరకు వచ్చి సారీ చెప్పాడు. కీపర్‌గా ఉన్న రాహుల్, స్పిన్పర్ యుజ్వేంద్ర చహల్ కూడా అతని దగ్గరకు పరిగెత్తుకొచ్చారు.
ఇదే సమయంలో అక్కడ ఫన్ జనరేట్ అయింది. దెబ్బ ఎక్కడ తగిలింది అంటూ రాహుల్.. ఫించ్‌కు గిలిగింతలు పెట్టబోయాడు. వెంటనే ఫించ్ రాహుల్ చేతిని పక్కకు నెట్టాడు. ఆ సమయంలో అక్కడ నవ్వులు పూశాయి. ఇదంతా కెమెరాలకు చిక్కడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఫించ్‌కు తగిలిన ఆ బాల్ని అంపైర్ నో బాల్‌గా ప్రకటించడంతో ఫ్రీ హిట్ లభించింది. కాని దానిని ఆసీస్ కెప్టెన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ 390 పరుగుల టార్గెట్ చేధించడానికి నానా కష్టాలు పడుతుంది.
KL Rahul just checking on Aaron Finch after getting hit by a full toss 😅 #AUSvIND pic.twitter.com/lb9Kzthisl
— cricket.com.au (@cricketcomau) November 29, 2020