aacharya : మెగా బ్రేకింగ్ : ‘ఆచార్య’ రక్షోభవ..

aacharya : మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ లో చేస్తున్న మూడో సినిమా ఆచార్య. ఎండాకాలంలో థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి సంబంధించి రెగ్యులర్ అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. ఆ క్రమంలోనే ఇవాళ (శుక్రవారం) సరిగ్గా 4 గంటల 5 నిమిషాలకు టీజర్ ని రిలీజ్ చేశారు. ఒక నిమిషం ఏడు సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో చిరు అభిమానులకు కనువిందు చేస్తోంది.

గుణ‘పాఠాలు’..

ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం. అలాంటివారి జీవితాలే ప్రమాదంలో పడితే.. ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు. పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా.. అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా.. గుణపాఠాలు చెప్తాననేమో.. ఆచార్య.. దేవోభవ.. ఆచార్య.. రక్షోభవ..’’ అనే పంచ్ డైలాగులతో, బ్యాక్ గ్రౌండ్ టైటిల్ సాంగ్ తో టీజర్ ఆకట్టుకుంటోంది.

సమ్మర్ లో..aacharya

కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ డ్రామా ఫిల్మ్ గా రూపొందుతున్న ‘ఆచార్య’ ఈ ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సినిమా యూనిట్ ఈ టీజర్ చివర లో ప్రకటించారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ అందించాడు. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ తేజ్ నిర్మాతలు. ఈ మూవీలో చెర్రీ కూడా ‘సిద్ధ’ పాత్రలో మెరవనున్నాడు.

Advertisement