Ayodhya : భార్య‌ను ముద్దు పెట్టుకున్న భ‌ర్త‌.. చిత‌క‌బాదిన జ‌నం

NQ Staff - June 23, 2022 / 09:01 AM IST

Ayodhya : భార్య‌ను ముద్దు పెట్టుకున్న భ‌ర్త‌.. చిత‌క‌బాదిన జ‌నం

Ayodhya : క‌ట్టుకున్న భార్య‌ను ముద్దు పెట్టుకుంటే త‌ప్పేముంది.. దానికి భ‌ర్త‌ని చిత‌క‌బాద‌డం ఎందుకు అనే అనుమానం మీలో క‌లుగుతుంది క‌దా, ఇక్క‌డే ఓ ట్విస్ట్ ఉంది. ప‌విత్ర‌మైన న‌దిలో పుణ్య స్నానాలు చేస్తుండ‌గా, ప‌క్క‌నున్న వారికి కోపం రావ‌డంతో చిత‌క‌బాదారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంది.

A young Man was attacked and thrashed badly because he kissed his wife while taking a bath in Ayodhya river

A young Man was attacked and thrashed badly because he kissed his wife while taking a bath in Ayodhya river

భ‌లే ప‌ని అయిందిగా..!

అయోధ్యలోని స‌ర‌యూ న‌దిలో ఓ న‌వ‌ జంటకు చేదు అనుభవం ఎదురైంది. ఈ నదిని భ‌క్తులు ప్ర‌వితంగా భావించి.. పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అదే సమయంలో ఓ జంట స్నానం కోసం నదిలోకి దిగింది. అయితే.. వారికి ఏమైందో ఏమో కానీ, వారు ఎక్క‌డ ఉన్నారో మరిచిపోయారు. ఆ న‌దినే స్మిమింగ్ పూల్ గా భావించారో ఏమో.. అంద‌రూ చూస్తుండగానే ఆ జంట‌ లిప్ టు లిప్ కిస్ చేసుకుంటూ రెచ్చిపోయారు.

వారి సృతి మించిన వ్య‌వ‌హ‌రాన్ని చూసిన చుట్టుపక్కల భ‌క్తుల‌కు పిచ్చ కోపం వచ్చింది. ఆ దంపతులపై మండిపోయింది. తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. భార్య ముందే భర్తకు నాలుగు తగిలించారు. పవిత్రమైన ప్రదేశంలో ముద్దులాడుకుంటారా? అంటూ భర్త చెంపలు వాయించారు. దీంతో ఆ జంట కంగుతింది.

భార్య ఎంత బతిమిలాడినా జనాలు భర్తను విడిచిపెట్టకుండా చితక్కొట్టారు. పాపం.. ఆ జంట ఒకటి అనుకుంటే అక్కడ మరొకటి జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయోధ్య కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సరయూ నది ఒడ్డున మంగళవారం ఈ ఘటన జరిగిందని, దీనికి సంబంధించిన వీడియో బుధవారం వైరల్‌గా మారిందని పోలీసులు తెలిపారు. అయితే.. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయితే, పోలీసులు ఈ విషయంపై విచారణ జరుపుతున్నారు. దాడి చేసిన నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us