ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికూతురు
Admin - August 14, 2020 / 09:26 AM IST

ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. వరకట్న వేధింపులు అంటూ ఏకంగా ముగ్గురు యువకులను మోసం చేసింది ఓ కిలాడీ లేడి. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల అనే గ్రామానికి చెందిన రవళి అనే యువతీ మూడు పెళ్లిళ్లు చేసుకుంది. మొదటగా 2015లో అన్నారం గ్రామానికి చెందిన సురేష్ అనే యువకున్ని ప్రేమించింది. అయితే సురేష్ ప్రేమించి, పెళ్ళికి నిరాకరిస్తున్నడని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. రవళి మాటలు నమ్మిన పోలీసులు సురేష్ తో పెళ్లి చేసారు. అయితే కొంతకాలం తరువాత సురేష్ తనను వరకట్నం తేవాలని వేధిస్తున్నాడని కేసు పెట్టింది.
చివరకు గ్రామ పెద్దల సమక్షంలో 3 లక్షల రూపాయలు సెటిల్మెంట్ చేసుకుంది. ఇక 2018 లో ఇద్దరి అంగీకారంతో కోర్ట్ విడాకులు మంజూరు చేసింది. తరువాత రెండో పెళ్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్లార్ మండలం కొయ్యూర్ కు చెందిన శ్రీనివాస్ రెడ్డి ని పెళ్లి చేసుకుంది. ఇక శ్రీనివాస్ రెడ్డి తో 5 నెలల కాపురం తరువాత సేమ్ డైలాగ్ కొట్టింది ఈ మాయ లేడి. రెండో భర్త కూడా వరకట్నం కోసం వేధిస్తున్నాడని అతనిపై కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. తరువాత పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేసారు. ఆఖరికి 3 లక్షల రూపాయలు సెటిల్మెంట్ చేసుకుంది. అయితే ఆ కేసు కోర్ట్ లో ఉండగానే మరో యువకున్ని ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన వ్యక్తితో మూడో పెళ్లి చేసుకుంది.
ఇక గతంలో రెండు పెళ్లిళ్లు అయ్యాయని తెలుసుకున్న మూడో భర్త సురేష్ ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చిన సురేష్ అసలు విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. దీనితో తన భర్త వరకట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నాడని రవళి స్వగ్రామంలో వాటర్ ట్యాంక్ ఎక్కి బయాందోళనకు గురి చేసింది. అయితే రవళి డబ్బు కోసం ఎంతటి ఘోరానికైనా పాల్పడుతుందని సురేష్ చెల్లెలు చెప్తుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రవళి గురించి విచారణ చేయగా తనకు గతంలో రెండు పెళ్లిళ్లు అయిన విషయం నిజమే అని తెలిపారు. అలాగే తన మీద గతంలో రెండు కేసులు కూడా నమోదయిన విషయం వాస్తవమేనని పోలీసులు వివరించారు.