సెల్ఫీ దిగుతూ అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం

Advertisement

టెక్నాలజీని మనకున్న తెలివిని పెంచుకోవడానికి, మన జీవిత విధానాన్ని మెరుగు పరుచుకోటానికి వాడుకోవాలి గాని దాని వల్ల ప్రమాదంలో పడకూడదు. అమెరికాలో ఒక తెలుగు యువతి ఒక జలపాతం దగ్గర సెల్ఫీ దిగుతూ అందులో పడి మృతి చెందింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె కమల (26) గుడ్లవల్లేరులో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి అమెరికా వెళ్లారు.

ఎంఎస్‌ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం కొలంబియాలో ఉంటున్నారు. శనివారం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొస్తూ అట్లాంటా సమీపంలోని జలపాతం వద్ద ఆగారు. అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మృతి చెందారు. నాట్స్‌ సహకారంతో ఆమె మృతదేహాన్ని భారత్‌ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కుమార్తె మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here