Parents Meeting : పేరెంట్స్ మీటింగ్‌కి బాయ్‌ఫ్రెండ్‌ని తీసుకొచ్చిన విద్యార్థిని.!
NQ Staff - December 14, 2022 / 11:48 AM IST

Parents Meeting : విద్యార్థులు వింత పోకడలతో ఇటు ఉపాధ్యాయులకీ, ఇంకోపక్క తమను కని పెంచిన తల్లి దండ్రులకీ ఝలక్ ఇస్తుండడం చర్చనీయాంశమువుతోంది. తాజాగా, తన బాయ్‌ఫ్రెండ్‌ని తీసుకొచ్చిన ఓ విద్యార్థిని, అతన్ని తన సోదరుడిగా పరిచయం చేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.
విషయంలోకి వెళితే, బెంగళూరు నగరంలోని ఓ విద్యార్థిని పేరెంట్స్ మీటింగ్‌కి తల్లిదండ్రులకు బదులుగా తన బాయ్‌ఫ్రెండ్‌ని తీసుకొచ్చి, అతన్ని తన సోదరుడిగా పరిచయం చేసింది స్కూల్ యాజమాన్యానికి.
అనుమానంతో ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడ్డ వైనం..
ఎందుకో స్కూల్ యాజమాన్యానికి విద్యార్థిని విషయంలో అనుమానమొచ్చింది. ఇద్దర్నీ వేర్వేరుగా ప్రశ్నించడంతో బండారం బయటపడి పోయింది. కొన్ని ప్రశ్నలకు ఇద్దరూ ఒకే సమాధానం చెప్పినా, ఇంకాస్త గుచ్చి గుచ్చి ప్రశ్నలు సంధించడంతో తడబడ్డారు.
దాంతో, వీరిద్దరూ చేసిన పనిని వారి తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం తెలియజేసింది. అదే సమయంలో మిగతా విద్యార్థుల తల్లిదండ్రులూ ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా వుండాలని కోరుతూ వారికి సమాచారం పంపడం గమనార్హం.
చిన్న వయసు నుంచే ఇలాంటి చర్యలకు విద్యార్థినీ విద్యార్థులు తెగబడటం ఆందోళనకరమని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.