Pregnant : వైరల్.. భూమికి ఆకాశానికి మధ్య బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
NQ Staff - January 26, 2023 / 11:30 PM IST

Pregnant : గర్భంతో ఉన్న మహిళ బస్సు ప్రయాణంలో లేదా రైలు ప్రయాణంలో డెలివరీ అయితేనే గొప్ప విషయంగా మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటిది ఒక గర్భిణి ఏకంగా నింగికి నేలకు మధ్య లో తన బిడ్డకు జన్మనివ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
ఆ తల్లి బిడ్డ గురించి ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం అంటే అది కేవలం ఆకాశంలో డెలివరీ అవ్వడమే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టోక్యో నుండి దుబాయి కి వెళ్తున్న విమానంలో ఒక గర్భిణి స్త్రీ ప్రయాణం చేస్తోంది.
12 గంటల విమాన ప్రయాణంలో విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సమయానికే గర్భిణి యొక్క పురిటి నొప్పులు మొదలు అయ్యాయి. దాంతో ఆమె కు క్యాబిన్ క్రూ సహాయం చేయడం జరిగింది. హెల్త్ ఎమర్జెన్సీ అందించి డెలవరీ చేశారు.
విమానం దుబాయి లో ల్యాండ్ అయిన వెంటనే తల్లి మరియు బిడ్డను హాస్పిటల్ కి తరలించారు. వారి ఆరోగ్యం బాగుందని.. ఆకాశంలో బిడ్డ జన్మించినా కూడా ఇబ్బంది ఏమీ లేదు అన్నట్లుగా వైధ్యులు పేర్కొన్నారు. ఆకాశంలో పుట్టిన ఆ బిడ్డ అదృష్టవంతులు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.