Cricket : బెట్టింగ్‌లో కోటి గెలిచిన ప్లంబర్.. అంతా ‘డ్రీమ్ 11’ మహిమేనంట..

Cricket : బెట్టింగ్‌లో కోటి గెలిచిన ప్లంబర్.. అంతా ‘డ్రీమ్ 11’ మహిమేనంట..
అదృష్టం ఎప్పుడు ఎవరినీ ఎలా వరిస్తుందో తెలీదు. అది మనదాక వచ్చేవరకు ఎదురుచూడటమే తప్పా మనం చేయాల్సింది ఏమీ ఉండదు. పూజలు చేస్తేనో, దానాలు చేస్తేనో అదృష్టం వరిస్తుందనేది అంతా బూటకం అని కొందరు అంటున్నారు. దేవుడిపై నమ్మకం ఉన్న వారు మాత్రం ఆ పూజ చేయాలి. ఇన్ని దానాలు చేయాలి. తడి బట్టలతో రావి చెట్టూ తిరుగుతూ లక్కు జిగురులా పట్టుకుంటుందని ఎన్నో చెబుతుంటారు. అలా పూజలు, పునస్కారాల పేరిట ఉన్న డబ్బులు పోగొట్టుకుంటారే తప్పా వారికి వచ్చేదేమీ ఉండదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామం ట ఓ వ్యక్తి బెట్టింగ్‌లో రూ.కోటి గెలుచుకున్నాడు.

A Person Won 1 Crore in Cricket Betting App
A Person Won 1 Crore in Cricket Betting App

ఇకపోతే బెట్టింగ్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్.. బెట్టింగ్‌లో రాజ్యాలు, ఆస్తులు పోగొట్టుకుని రోడ్డున పడిన వారు ఒక్కసారి చరిత్ర చూసుకుంటే కోకొల్లలు. బెట్టింగ్ అనేది ఒక వ్యసనం. దీనికి అలవాటు పడి చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుని, కుటుంబాలకు దూరం అయ్యారు. బెస్ట్ ఉదా.. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఒకప్పుడు కింగ్‌లా బతికాడు. ఆయన కూడా బెట్టింగుల జోలికి వెళ్లి అప్పుల పాలై దేశాన్ని విడిచిపారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.

అయితే, డ్రీమ్ 11 బెట్టింగ్ యాప్‌ ఓ వ్యక్తి జీవితాన్ని మార్చేసింది. రాత్రికి రాత్రే కోటిశ్వరుడు అయ్యాడు. క్రికెట్ బెట్టింగులో బిహార్‌ రాష్ట్రం కటిహార్ జిల్లా మనిహారీకి చెందిన బబ్లూ మండల్ రూ. కోటి గెలుచుకున్నాడు. ఈయన ఓ సాధారణ ప్లంబర్. మొన్న జరిగిన సీఎస్కే వర్సెస్ ఢిల్లీ (క్వాలిఫైయర్-1) మ్యాచ్‌పై బెట్టింగ్ వేయగా అదృష్టం తలుపుతట్టింది.ఏకంగా కోటి గెలుచుకున్నాడు. డ్రీమ్ 11యాప్ గురించి తనకు ఏమీ తెలీదని, తన మిత్రుడు ఫోన్‌లో వేసి ఇచ్చాడని చెప్పాడు. కొద్దిరోజుల ముందు నుంచే బెట్టింగ్ పెడుతున్నానని, మొదట రూ.200 మాత్రమే బెట్ పెట్టానని వివరించాడు. ఒకేసారి కోటి గెలవడంతో బబ్లూ ఆనందానికి అవధుల్లేవ్. వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టుకుని, మిగతా డబ్బులో కొంత దేవుడికి విరాళం ఇస్తానని తెలిపాడు బబ్లూ. కాగా, కోటిలో రూ.30లక్షలు టాక్స్ కింద కట్ అయ్యాయని.. మిగతా రూ.70 లక్షలు చేతికి వచ్చినట్టు బబ్లూ మండల్ తెలిపాడు.