Lavanya Tripathi Rare Disease Update : లావణ్య త్రిపాఠికి అరుదైన వ్యాధి.. స్వయంగా ప్రకటించిన హీరోయిన్..!

NQ Staff - June 29, 2023 / 09:43 AM IST

Lavanya Tripathi Rare Disease Update : లావణ్య త్రిపాఠికి అరుదైన వ్యాధి.. స్వయంగా ప్రకటించిన హీరోయిన్..!

Lavanya Tripathi Rare Disease Update : లావణ్య త్రిపాఠి పేరు ఈ నడుమ తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. ఆమె మొన్నటి వరకు టాలీవుడ్ హీరోయిన్. కానీ ఇప్పుడు మెగా ఫ్యామిలీకి కాబోయే కోడలు. ఆమెచాలా కాలంగా తెలుగులో సినిమాలు చేస్తోంది. కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ప్రస్తుతం ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు కూడా లేవు.

ఎందుకంటే ఆమె కొంత కాలంగా నటిస్తున్న సినిమాలు అన్నీ ప్లాపే అవుతున్నాయి. ఈ క్రమంలోనే మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్ తో ప్రేమలో పడటం, రీసెంట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకోవడం చక చకా జరిగిపోయాయి. వీరిద్దరూ ఐదేండ్లుగా ప్రేమలో ఉన్నారు. కానీ ఇన్ని రోజులు తమ ప్రేమను బయట పెట్టలేదు.

ఇదిలా ఉండగా తాజాగా లావణ్య త్రిపాఠికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. ఆమెకు అరుదైన వ్యాధి ఉందంట. ఈ విషయాన్ని ఆమెనే గతంలో స్వయంగా వెల్లడించింది. ట్రిపో ఫోబియా అనే వ్యాధి ఉందని.. దాని వల్ల కొన్ని ఆకారాలు, వస్తువులను చూస్తే తెలియకుండానే తనలో భయం కలుగుతుందని తెలిపింది ఈ భామ.

రెండేండ్ల క్రితం ఆమె విషయాన్ని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రస్తుతం కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం వరుణ్‌ తేజ్ తో కలిసి ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. పెండ్లికి ముందే వీరిద్దరూ కలిసి ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేయడం విశేషం.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us