Maharashtra to Manchester: మ‌హారాష్ట్ర నుండి మాంచెస్ట‌ర్ వ‌ర‌కు ఇనుప కుర్చీ ప్ర‌యాణం.. ఆశ్చ‌ర్యంగా ఉందే..!

Maharashtra to Manchester: ప్ర‌స్తుతం మ‌న భార‌తీయ మార్కెట్ చాలా పెరిగింది. సినిమాల‌తో మ‌న దేశ ఖ్యాతి ఖండాంత‌రాలు దాటుతుండ‌గా, వ‌స్తువులు కూడా ఇత‌ర దేశాల వారి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. దీంతో వేలం పాట‌లోనో లేదంటే ఇత‌ర ప‌రిస్థితుల‌లో వాటిని ద‌క్కించుకుంటున్నారు. తాజాగా ఓ కుర్చీ మహారాష్ట్ర నుంచి యూకేలోని మాంచెస్టర్‌కు వెళ్లింది.

A metal Chair travelled from Maharashtra to Manchester
A metal Chair travelled from Maharashtra to Manchester

ఓ ఇనుప కుర్చి ఖండాలు దాటి దాదాపు 7000 కిలో మీట‌ర్లు ప్రయాణించింది. ఇది మాములు విష‌యం కాదు. మ‌రి అదెలా ప్రయాణించిందో తెలియాలంటే ఈ స్టోరీ గురించి తెలుసుకోవ‌ల‌సిందే. జర్నలిస్ట్‌ సునందన్‌ లేలే ఇటీవల ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌ సిటీని సందర్శించాడు. అక్కడ ఓ రెస్టారెంట్‌లోని ఓపెన్‌ సీటింగ్‌ ఏరియాలో ఉన్న కుర్చీ అతన్ని బాగా ఆకర్షించింది.

ఇనుముతో ఉన్న కుర్చీ వెనక మరాఠీలో ‘బాలు లోఖండే సవ్లాజ్‌’ అని రాసి ఉంది. దీనిని చూసిన అతను ఆశ్యర్యపోయాడు. ‘ఇది వింత కాదా’ అంటూ తన ట్విటర్‌లో దీనికి సంబంధించిన వీడియో పోస్టు చేశారు. ఈ ఆసక్తికరమైన విషయాన్ని చూసి నెటిజన్లు షాకవుతున్నారు. కుర్చీ ప్రయాణాన్ని చూస్తుంటే భారతీయ మార్కెట్ విస్తరణ ఏ విధంగా ఉందో అర్థమవుతోందని, చాలామంది మరాఠీలుగా గర్వపడుతున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కుర్చీ మహారాష్ట్రలోని సాల్వాజ్‌ గ్రామానికి చెందిన టెంట్‌హౌజ్‌ బాలు లోఖండేకు చెందినది.
టెంట్‌హౌజ్‌ యజమాని ప్లాస్టిక్ కుర్చీలను వాడుతుండటంతో లోఖాండే తన పాత ఇనుప కుర్చీలను 15 ఏళ్ల క్రితం పాత ఇనుప సామానులకు అమ్ముకోవాల్సి వచ్చింది. అది కాస్తా మహారాష్ట్ర నుంచి 7,627 కిలోమీటర్ల దూరంలోని మాంచెస్టర్‌కు చేరింది.