చంద్రబాబు ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం. జులై లో తుది విచారణ

Admin - December 17, 2020 / 04:37 PM IST

చంద్రబాబు ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం. జులై లో తుది విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసు విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక ఈ కేసులో చంద్రబాబు పాత్ర కూడా ఉందని సుమారు 27 సార్లు వార్తలు బయటకు వచ్చాయి. కానీ చంద్రబాబు మీద ఎందుకు కేసులు పెట్టలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక ఈ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీం కోర్ట్ లో ఆర్కే అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేసాడు. దీనితో సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ బాబ్డే ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఇక ఈ విచారణలో పిటిషన్ దాఖలు చేసిన ఆర్కే తరుపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తన వాదనలు ఘనంగా వినిపించాడు.

Politicians worrying with supreme court decisionPoliticians worrying with supreme court decision

ఇక ఈ నేపథ్యంలో ఈ కేసు కు సంబందించి విచారణ తేదీని ప్రకటించాలని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోరారు. దీనితో సమ్మర్ సెలవుల అనంతరం జులై లో ఈ కేసును విచారిస్తామని చీఫ్ జస్టిస్ స్పష్టం చేసాడు. అలాగే లిఖితపూర్వకంగా ఆదేశాలను ఇస్తామని పేర్కొన్నారు. అయితే తాజాగా రాజకీయ నాయకులపై ఉన్న కేసులను త్వరగా విచారణ జరపాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనితో ఈ కేసు కూడా తెర మీదకు వచ్చింది.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us