Viral News : స్కూటీ మీదనే రొమాన్స్ చేస్తూ బరితెగించిన జంట.. తప్పని చెప్పినందుకు ఏకంగా ప్రాణాలు హరి!
NQ Staff - March 7, 2023 / 10:12 PM IST

Viral News : దేశంలో కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే భయాందోళనలకు గురి కావాల్సి వస్తుంది.. ఎందుకంటే రోజురోజుకూ విచలివిడి తనం పెరుగుతుంది. తప్పు చేసిన వారిని ప్రశ్నించడం కూడా పాపంగా మారుతుంది.. కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తుంది.. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఒక భయానకమైన ఘటన చోటు చేసుకుంది..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్కూటీ మీద వెళ్తున్న ఒక జంట బండి మీదనే రొమాన్స్ చేసారు.. బహిరంగ ప్రదేశంలో ఇలా చేయకూడదు అనే సెన్స్ కూడా లేకుండా స్కూటీ మీదే ముద్దులు పెట్టుకుంటున్నారు. దీంతో పక్కనే వెళ్తున్న మరో బైక్ పర్సన్ వారిని అలా చేయవద్దని పబ్లిక్ ప్లేసులో ఇలా చేయడం సరికాదు అని మందలించాడు.. అయితే ఇలా చెప్పడమే ఆయన తప్పు కావొచ్చు..
ఎందుకంటే ఆ స్కూటీ మీద రొమాన్స్ చేస్తున్న జంట అతడు అలా చెప్పడంతో ఏకంగా అతడిపై దాడి చేసి ప్రాణాలు తీశారు.. ఘజియాబాద్ లోని సాహిబాబాద్ లో ఈ దారుణం చోరు చేసుకుంది. మనీష్ కుమార్ అనే వ్యక్తి ఒక మహిళతో స్కూటీ మీద వెళ్తున్నాడు. అలా వెళ్తునే స్కూటీ మీదనే ముద్దులు పెట్టుకుంటున్నారు.. అలా చూసిన 27 ఏళ్ల విరాట్ మిశ్రా అనే యువకుడు వారిని అలా చేయొద్దని వారించాడు.
దీంతో మనీష్ ఆగ్రహంతో తన ఫ్రెండ్స్ ను అక్కడికి పిలిచి విరాట్ మీద దాడి చేయించారు.. ఇటుకలు, కర్రలతో దాడి చేయడంతో అతడు మృతి చెందాడు.. అతడిని కాపాడేందుకు బంటీ అనే వ్యక్తి వెళ్లగా అతడిని కూడా కొట్టి గాయపరిచారు.. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన ఇప్పుడు అందరిని ఉలిక్కి పడేలా చేస్తుంది..