Hyderabadi : వేశ్య కోసం ఇంటర్నెట్‌లో వెతికి 2 లక్షలు పోగొట్టుకున్న హైద్రాబాదీ.!
NQ Staff - January 5, 2023 / 02:54 PM IST

Hyderabadi : ఓ హైద్రాబాదీ వ్యక్తి ఆన్‌లైన్‌లో వేశ్య కోసం వెతికాడు.! ఈ క్రమంలో దాదాపు రెండు లక్షలు పోగొట్టుకున్నాడు. ఇంతకీ, కోరుకున్నట్లుగా వేశ్య వచ్చిందా.? అంటే అదీ లేదు.!
చేసిన పనికి సిగ్గుపడలేదు సరికదా, పోగొట్టుకున్న రెండు లక్షల కోసం పోలీసుల్ని ఆశ్రయించాడు. పైగా, అతడొక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.! అంటే, విద్యావంతుడే మరి.! అంతటి విద్యావంతుడు, ఎలా ఆన్‌లైన్ వ్యభిచార మాయలో చిక్కుకున్నాడట.?
సబ్బు బిల్లా.. అగ్గి పుల్లా..
సబ్బు బిల్లా.. అగ్గిపుల్లా.. కుక్క పిల్లా.. కాదేదీ కవితకనర్హం అన్నాడో కవి. ఇంటర్నెట్‌లోనూ అంతే.. కాదేదీ ఆన్‌లైన్‌కి అనర్హం. అలాగే వేశ్యలు కూడా ఆన్‌లైన్‌లో దొరుకుతున్నారు.
బాగా అలవాటు పడినవాడైతే, ఇలా బోల్తా కొట్టి వుండడు. ఏదో ట్రై చేద్దామని అ్డడంగా బుక్కయిపోయినట్లున్నాడు. తొలుత బుకింగ్ కోసం 510 చెల్లించి, ఆ తర్వాత 5,500 రూపాయలు చెల్లించి.. సెక్యూరిటీ డిపాజిట్ అంటూ మరో 7,800 చెల్లించి.. మొత్తంగా 1.97 లక్షలు సమర్పించుకున్నాడు. మొత్తమ్మీద, అయ్యగారి బలుపు ఇలా దిగిపోయిందన్నమాట.