Husband : భార్యపై అలక బూని భోజనం మానేసిన భర్త.! 42 ఏళ్లుగా ఛాయ్‌తోనే జీవనం.!
NQ Staff - December 10, 2022 / 01:35 PM IST

Husband : ఎవరైనా అలకబూనితే, అన్నం తినడం మానేయడం చాలా చాలా సహజం. కానీ, ఎన్ని రోజులు.? మహా అయితే ఒకరోజు, రెండు రోజులు. కానీ, ఈ పెద్దాయన ఏకంగా 42 ఏళ్లు భోజనం మానేశాడు భార్యపై అలకతో.
ఇదెక్కడి చిత్రం.! 42 ఏళ్లు భోజనం మానేస్తే, ఏ మనిషయినా బతికుంటాడా.? కానీ ఈయన బతికే వున్నాడు. జైపూర్ జిల్లాలోని వికీపుర్ గ్రామానికి చెందిన రామచంద్రకు 22 ఏళ్ల వయసులో సీత అనే అమ్మాయితో వివాహం జరిగింది. 42 ఏళ్ల క్రితం ఈ దంపతులిద్దరి మధ్యా చిన్న గొడవ జరిగింది.
అన్నం పైనే అలక.! ఎందుకలగా.!
ఆ రోజు నుంచీ భార్య మీద అలక పూని, అన్నం తినడం మానేశాడు. కానీ, ఛాయ్ తాగుతూ అటుకులు తింటూ జీవనం సాగిస్తున్నాడు. పూర్తి ఆరోగ్యంగా వున్నాడు ఇప్పటికీ రామ చంద్ర. ప్రస్తుతం ఆయన వయసు 76 ఏళ్లు.
వయసులో వున్నప్పుడు ఓ రోజు కూలి పనికి వెళ్లి వచ్చిన రామ చంద్ర, అన్నం పెట్టమని భార్యను అడగ్గా.. ఆమె అనారోగ్యం కారణంగా భర్తకు అన్నం పెట్టలేకపోయింది. అది అర్ధం చేసుకోకుండా రామచంద్ర భార్యపై గొడవ పడి అప్పటి నుంచీ అన్నం తినడం మానేశాడు.
ఆ తర్వాత ఎంత మంది చెప్పినా వినలేదు. కేవలం అన్నం తినడం మాత్రమే మానేసిన రామచంద్ర, భార్యతో సఖ్యతగానే వుంటాడు. కానీ, అన్నం మాత్రం ముట్టడంతే. విచిత్రమైన జంట కదా.!