Gujarat : భార్యను నగ్నంగా ఊరేగించిన భర్త.. గ్రామస్తులు చూస్తుండగా దారుణం..!
NQ Staff - June 3, 2023 / 01:30 PM IST
Gujarat : అప్పుడప్పుడు సమాజం తలదించుకునే పనులు చాలానే జరుగుతుంటాయి. ఒకప్పుడు ఇలాంటివి పెద్దగా తెలిసేవి కావు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటివి క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ భర్త తన భార్యను బట్టల్లేకుండా నగ్నంగా ఊరేగించాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గుజరాత్ లోని దాహోద్ జిల్లాలోని ఓ గిరిజన మహిళకు కొన్నేళ్ల క్రితం పెళ్లి జరిగింది. నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత తన భర్తను వదిలేసి వెళ్లిపోయింది. మెహ్సానా జిల్లాలోని చనస్మా గ్రామంలో వేరే వ్యక్తితో కలిసి సహజీవనం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మొదటి భర్త ఆమెపై పగ పెంచుకున్నాడు.
అయితే ఇటీవల రెండోభర్త గ్రామమైన రాంపురాలో బంధువలు పెళ్లి జరిగింది. ఈ వేడుకకు రెండో భర్త తల్లి తన కొడుకు, కోడలిని ఆహ్వానించింది. అలాగే తన కోడలి మొదటి భర్తను కూడా ఆహ్వానించింది. దాంతో ఈ ముగ్గురూ ఒకే చోట కలుసుకున్నారు. తన భార్యను చూడగానే మొదటి భర్త చాలా కోపంతో ఊగిపోయాడు.
ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిపోయాడు. మర్గల గ్రామంలోకి తీసుకెళ్లి ఆమెను అందరి ముందే బట్టలు విప్పి తీవ్రంగా కొట్టాడు. గ్రామంలో ఊరేగించాడు. ఆపాల్సింది పోయి అతనికి మరో ముగ్గురు సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని మొదటి భర్తను, అతనికి సహకరించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.