A Husband Married His Wife To Her Boyfriend : ప్రేమించిన వ్యక్తితో భార్యకు పెళ్లి చేసిన భర్త.. ఇదేం ట్విస్ట్ గురూ..!
NQ Staff - July 1, 2023 / 01:07 PM IST

A Husband Married His Wife To Her Boyfriend :
ఈ సమాజంలో ప్రేమ పెళ్లిళ్లకు వచ్చే అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు. ఇక ప్రేమ చుట్టూ ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో చూస్తున్నాం. అమ్మాయి తరపు వారు అబ్బాయిని చంపేయడం, తనకు దక్కనిది ఎవరికీ దక్కొద్దనే ఉద్దేశంతో అమ్మాయిలను చంపేస్తున్న అబ్బాయిలు. ఇలా ఒక్కటేమిటి.. ఎన్నో దారుణాలు వెలుగు చూస్తున్నాయి.
అయితే ఈ కథ అన్నింటికంటే చాలా డిఫరెంట్ గా ఉంది. ఉత్తర ప్రదేశ్ లో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యకు ఆమె ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి దగ్గరుండి పెండ్లి చేశాడు. ఇంకో విషయం ఏంటంటే.. అమ్మాయి తల్లిదండ్రులను, తన ఫ్యామిలీని కూడా ఆయనే ఒప్పించాడు.
ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాలోని పూర్వ గ్రామానికి చెందిన దినేశ్ కు ఏడాది క్రితం గులాబి అనే అమ్మాయితో పెండ్లి అయింది. అప్పటి నుంచి ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. అయితే ఆమె కొన్ని రోజులుగా తమ పక్కింటి అబ్బాయితో ప్రేమలో పడింది. ఇద్దరూ తరచూ ఫోన్లు మాట్లాడుకునే వారు.
పంచాయితీ పెట్టి..
రీసెంట్ గా వీరిద్దరూ ఫోన్ లో మాట్లాడుకోవడం చూశాడు దినేశ్. తన భార్యను నిలదీశాడు. ఆ అబ్బాయితోనే జీవిస్తానని చెప్పి వేడుకుంది. దాంతో తన భార్య మనసు అర్థం చేసుకున్న దినేశ్.. పెద్ద మనషుల వద్ద పంచాయితీ పెట్టించాడు. అమ్మాయి తల్లిదండ్రులను, తన ఫ్యామిలీని కూడా తానే ఒప్పించాడు.
చివరకు తన భార్యకు, ఆమె ప్రేమించిన అబ్బాయితో దగ్గరలోని గుడిలో పెండ్లి చేశాడు. ఆయనే పెండ్లి పెద్దగా మారి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయం చుట్టు పక్కల గ్రామానికి పాకింది. కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయగా బాగా వైరల్ అవుతోంది. మరి ఆ భర్త చేసిన పనికి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.