Crime : వీడేం భర్త.. వ్యాపారంలో లాభాల కోసం భార్యకి అందరిముందు నగ్నంగా స్నానం
NQ Staff - August 23, 2022 / 05:16 PM IST

Crime: మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యే భార్యాభర్తలు.. జీవిత కాలం కష్టసుఖాలను కలిసే పంచుకుంటారు. ఈ క్రమంలో ఎన్ని కష్టాలు వచ్చినా.. నష్టాలు ఎదురైనా.. భార్యను మాత్రం గడప దాటకుండా చూసుకునే భర్తలు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు. అయితే.. ఒకరిద్దరు చేస్తున్న దురాగతాలతో భర్తలకు చెడ్డపేరు వస్తోంది.
మూడ నమ్మకాల పిచ్చి..
శాస్త్ర సాంకేతిక రంగాలు ఇంతగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో డబ్బుపై అత్యాశతో ఓ భర్త తన భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తన స్వార్థం కోసం కట్టుకున్న భార్యను అందరి ముందర నగ్నంగా నిల్చోబెట్టాడు . మహారాష్ట్ర పుణెలో జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంతా వాసులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.

A Husband Greedy Money And Behaved Inappropriately His Wife
మహారాష్ట్రలో ని పుణెకు చెందిన ఓ వ్యక్తి వ్యాపారాలు చేస్తున్నాడు. అతనికి భార్య, కుటుంబం ఉంది. కొన్ని రోజులుగా అతనికి వ్యాపారంలో ఆశించిన మేరకు పురోగతి లేదు. దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో కొందరు క్షుద్రపూజ చేయించాలని ఉచిత సలహా ఇచ్చారు. ఇలా చేస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయని నమ్మించారు. అంతే కాకుండా ఇంట సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వస్తాయని మాయమాటలు చెప్పారు. దీంతో వారి మాటలను గుడ్డిగా నమ్మిన ఆ వ్యక్తం క్షుద్రపూజ చేసేందుకు ఉపక్రమించాడు.
అందులో భాగంగా భార్యను అందరి ముందు నగ్నంగా స్నానం చేయిస్తే ఇక తిరుగే లేదని నమ్మబలికాడు. డబ్బు మోజుతో అతడు అందుకు సరేనన్నాడు. దీనికి అతడి తల్లిదండ్రులు కూడా సహకరించారు. పూజల అనంతరం అతడు తన భార్యను అందరి ముందు నిలబెట్టి నగ్నంగా స్నానం చేయించాడు. చుట్టూ ఉన్నవారు సినిమా చూశారే తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని, అతడి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మాంత్రికుడి కోసం గాలిస్తున్నారు.